Prashanth Neel :స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ , పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో తెరకెక్కించిన “సలార్” సినిమా గత ఏడాది డిసెంబర్ లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీగా కలెక్షన్స్ రాబట్టింది.అయితే సలార్ పార్ట్ 2 షూటింగ్ ఈ ఏడాది మొదలు పెట్టి 2025 సంవత్సరం ఎండింగ్ లో రిలీజ్ చేయనున్నట్లు ఓ వార్త బాగా వైరల్ అయింది.దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో ఓ సినిమా తెరకెక్కించబోతున్నారు.అయితే ఈ సినిమాను గత ఏడాదే ప్రకటించిన ఎన్టీఆర్ ,ప్రశాంత్ నీల్ తమ మూవీస్ తో బిజీ గా ఉండటంతో సినిమా సెట్స్ పైకి వెళ్ళలేదు.
Read Also :Laapataa Ladies: ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న చిన్న సినిమా..ఏకంగా యానిమల్ రికార్డ్ బ్రేక్ చేసిందిగా
సలార్ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ముందుగా సలార్ పార్ట్ 2 ను తెరకెక్కించి ఆ తరువాత ఎన్టీఆర్ సినిమా షూటింగ్ చేయనున్నట్లు ఇటీవల ఓ న్యూస్ వైరల్ అయింది.కానీ తాజాగా ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ప్రశాంత్ నీల్ ,ఎన్టీఆర్ మూవీ ఈ ఏడాది ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుందని మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించింది.దీనితో ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త నిరాశకు గురయ్యారు.అయితే ప్రశాంత్ నీల్ మాత్రం ముందుగా ప్రభాస్ సినిమా పూర్తి చేసి ఆ తరువాత ఎన్టీఆర్ మూవీ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.అయితే ప్రశాంత్ నీల్ తరువాత సినిమా ఎవరితో అనే కన్ఫ్యూషన్ వీడాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.