Prashanth Neel : సలార్ మూవీ రెస్పాన్స్ పై ప్రభాస్ ఫుల్ హ్యాపీ.. కానీ నేను మాత్రం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన హైవోల్టేజ్ యాక్షన్ సినిమా ‘సలార్’ భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది..ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ మూవీ అభిమానుల అంచనాలను నిజం చేస్తూ భారీ బ్లాక్బాస్టర్ దిశగా సాగుతోంది. 8 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా సలార్ చిత్రం రూ.550కోట్లకు పైగా కలెక్ష్లను దక్కించుకొని రికార్డు క్రియేట్ చేసింది.. ఈ క్రమంలో సలార్‌కు వస్తున్న రెస్పాన్స్ గురించి ప్రభాస్ ఎలా స్పందించారో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ వెల్లడించారు. సలార్ మూవీ ప్రమోషన్లలో భాగంగా ప్రశాంత్ నీల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. సినిమా రిలీజ్ తర్వాత హీరో ప్రభాస్‌తో మాట్లాడారా అనే ప్రశ్నకు ఇలా సమాధానం ఇచ్చారు. సలార్‌కు వస్తున్న రెస్పాన్స్ గురించి తాజాగా ప్రభాస్‌తో మాట్లాడానని నీల్ తెలిపారు.సినిమా కలెక్షన్ల గురించి కూడా చర్చించినట్లు వెల్లడించారు.
సలార్ మూవీ రెస్పాన్స్ చూసి ప్రభాస్ చాలా సంతోషించినట్టు తెలిపారు.ఆయన రియాక్షన్ చాలా ఉత్సాహకరంగా ఉంది అని ప్రశాంత్ నీల్ చెప్పారు.అయితే తాను తెరకెక్కించిన చిత్రాలపై తనకు ఎప్పుడూ 100 శాతం సంతృప్తి ఉండదని ప్రశాంత్ నీల్ చెప్పారు. ఇంకా కాస్త మెరుగ్గా ఉండాల్సిందేమోనని అనిపిస్తుందని అన్నారు. తనకే కాదని, ప్రతీ ఫిల్మ్ మేకర్‌కు అలాగే అనిపిస్తుందని ఆయన చెప్పారు. ఏ ఫిల్మ్స్ మేకర్ అయినా కూడా పూర్తి స్థాయి లో సంతృప్తి చెందరు. అలాగే, నేను కూడా సలార్ మూవీ పై పూర్తిగా సంతృప్తి చెందలేదు. కేజీఎఫ్ 2 విషయం లో కూడా నేను పూర్తిగా సంతృప్తి చెందలేదు అని ప్రశాంత్ నీల్ వెల్లడించారు. అయితే, ప్రభాస్ పోషించిన దేవా క్యారెక్టర్ విషయంలో తాను ఎంతో సంతోషం గా ఉన్నానని ఆయన అన్నారు. సలార్ రెండో పార్ట్ ఇంకా భారీగా ఉంటుందని ప్రశాంత్ నీల్ తెలిపారు.సలార్ సినిమాలో ప్రభాస్ యాక్షన్ సీక్వెన్సులకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఈ యాక్షన్ సినిమాకు భారీ కలెక్షన్స్ సాధిస్తూ అన్ని చోట్ల రికార్డును క్రియేట్ చేస్తోంది
Also Read
- 8560mAh భారీ బ్యాటరీ, 6000 నిట్స్ డిస్ప్లే, IP69K రక్షణతో HONOR X70 Pro Max లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!
- IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 7540mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI Turbo 5 లాంచ్.! ధర ఎంతంటే.?
- Devajit Saikia: వైభవ్ సూర్యవంశీ గొడవపై స్పందించిన బీసీసీఐ.. కార్యదర్శి దేవజిత్ కీలక వ్యాఖ్యలు..
- Off The Record: మెట్రో కేంద్రంగా కాంగ్రెస్, బీజేపీ పొలిటికల్ వార్..
- Tags
- prabhas
- Prashanth Neel
- salaar
తాజావార్తలు
-
Historical Day: నేడు ట్రిపుల్ ధమాకా.. టీమిండియా ఫ్యాన్స్‌కు పండగే.. 12 గంటల పాటు నాన్‌స్టాప్ ఎంటర్టైన్మెంట్!
-
Prabhas : ప్రభాస్ ట్రిపుల్ బ్లాస్ట్… ఏడాదిలోనే 3 సినిమాలు రిలీజ్
-
Bollywood : కృతి సనన్, రష్మిక దేవరకొండను లాక్ చేసిన బిగ్ బ్యానర్.. ఏంటి సంగతి?
-
Lenovo Tab Plus Gen 2: లెనోవో ట్యాబ్ ప్లస్ జెన్ 2 విడుదల.. 9 JBL స్పీకర్లు, 12.1 ఇంచెస్ డిస్ప్లేతో థియేటర్ అనుభూతి
-
8560mAh భారీ బ్యాటరీ, 6000 నిట్స్ డిస్ప్లే, IP69K రక్షణతో HONOR X70 Pro Max లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!
ట్రెండింగ్
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 7540mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI Turbo 5 లాంచ్.! ధర ఎంతంటే.?
-
T20 World Cup 2026లో సంచలనం.. శ్రీలంక చరిత్రాత్మక విజయం.. డిఫెండింగ్ ఛాంపియన్‌కు వరుసగా రెండో షాక్!
-
6000mAh బ్యాటరీ, IP69 రేటింగ్, 50MP సోనీ కెమెరాతో TECNO SPARK 50 Pro లాంచ్.!
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్‌లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?