NTV Telugu Site icon

Prasanth Varma : సినిమాటిక్ యూనివర్స్ ఆలోచన అలా వచ్చింది..

Whatsapp Image 2024 01 25 At 12.46.08 Pm

Whatsapp Image 2024 01 25 At 12.46.08 Pm

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా,టాలెంటెడ్ డైరెక్టర్ కాంబోలో వచ్చిన హనుమాన్ మూవీ సంక్రాంతి కానుకగా విడుదలయి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.. ఈ మూవీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.. సినిమా భారీ హిట్ అయిన తర్వాత కూడా దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇంకా ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ‘హనుమాన్’ను ప్రమోట్ చేస్తూనే ఉన్నారు . అంతే కాకుండా తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ గురించి ఆసక్తికర విషయాలు తెలియజేసారు..ముందు హనుమాన్ తీయాలని అనిపించిన తర్వాత యూనివర్స్ బిల్డ్ అయ్యింది. ముందుగా ఈ ఒక్క సినిమా గురించే మేము ఆలోచించాం. మన పురాణాల్లో నుంచి ఏ క్యారెక్టర్ ని తీసుకొని హీరోగా సెలక్ట్ చేసుకోవాలి అని ముందు ఆలోచించాం. హనుమంతుడికి ఉన్న పవర్స్, ఆయన చేసే అల్లరి.. ఇదంతా చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. ఇంద్రుడిని ఇష్టపడేవాళ్లు అలాగే ఇష్టపడనివాళ్లు ఉంటారు. కానీ హనుమంతుడిని ఇష్టపడనివారు ఎవరూ ఉండరు. ఆయన యూనివర్సల్ హీరో. అందుకు ఇలా ప్రారంభించాం.

కానీ ఈ క్రమంలో ఎందుకు కేవలం హనుమంతుడి క్యారెక్టర్ మాత్రమే చేయాలి. ఇంకా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి కదా. అందరి నుంచి తీసుకుందాం. పెద్దగా బిల్డ్ చేద్దామనుకొని అక్కడి నుంచి మేము బిల్డ్ చేశాం  అంటూ అసలు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ ఆలోచన ఎలా వచ్చిందో బయటపెట్టాడు.మేము ముందుగా అనుకున్న దానికంటే టీజర్ కి 10 రెట్లు ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. వీఎఫ్ఎక్స్ ఎక్కువగా ఉండే సినిమా చేద్దామని మేము అనుకోలేదు. ఎంటర్టైనింగ్, సూపర్ హీరో సినిమా చేద్దామని అనుకున్నాం. కానీ టీజర్లో ఉన్న వీఎఫ్ఎక్స్ షాట్స్ కు ఎక్కువ ఆదరణ వచ్చింది. సినిమా నుంచి వీఎఫ్ఎక్స్ ఎక్కువగా ఆశిస్తున్నారని మాకు అర్థమయ్యింది. హనుమాన్ టీజర్ రిలీజ్ అయిన తర్వాత నేను మామూలుగా బయట ఎక్కడైనా కనిపించినప్పుడు వచ్చి మీ సినిమా వీఎఫ్ఎక్స్ ఎలా వస్తున్నాయని చాలా మంది అడిగేవారు. అందుకే మేము అనుకున్న దానికంటే 3 రేట్లు రేంజ్ పెంచాం’’ అంటూ వీఎఫ్ఎక్స్ తనకు సాయంగా ఉన్న వెంకట్ కుమార్ శెట్టికి దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రత్యేక క్రెడిట్స్ ను ఇచ్చారు .