NTV Telugu Site icon

Pramod Bhagat Suspended: పారాలింపిక్స్‌ ముందు భారత్‌కు షాక్.. స్వర్ణ పతక విజేతపై 18 నెలల నిషేధం!

Pramod Bhagat Suspended

Pramod Bhagat Suspended

Pramod Bhagat Out From Paris Paralympics: 2024 పారిస్ పారాలింపిక్స్‌కు ముందు భారత్‌కు భారీ షాక్ తగిలింది. టోక్యో పారా ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత, భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ప్రమోద్ భగత్‌పై సస్పెన్షన్ వేటు పడింది. డోపింగ్ నిరోధక నిబంధనలను ఉల్లంఘించినందుకు 18 నెలల పాటు సస్పెన్షన్‌ విధిస్తున్నట్లు బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్‌ (బీడబ్ల్యూఎఫ్‌) ప్రకటించింది. దీంతో 2024 పారిస్ పారాలింపిక్స్‌కు ప్రమోద్‌ దూరం కానున్నాడు. టోక్యో పారాలింపిక్స్‌ పురుషుల సింగిల్స్‌ ఎస్‌ఎల్‌3 కేటగిరీలో ప్రమోద్‌ గోల్డ్ మెడల్ గెలిచాడు.

Also Read: Manu Bhaker-Neeraj Chopra: మను బాకర్‌ ఇంకా చిన్నపిల్ల.. పెళ్లి వయసు రాలేదు: మను తండ్రి

‘బ్యాడ్మింటన్ ప్లేయర్ ప్రమోద్ భగత్‌ను 12 నెలల వ్యవధిలో మూడుసార్లు డోపింగ్ పరీక్షకు హాజరుకావాలని కోరాం. ఒక్కసారి కూడా అతడు హాజరుకాలేదు. తాను రాలేకపోవడానికి గల కారణాలను వెల్లడించడంలో విఫలమయ్యాడు. నిబంధనలు ఉల్లంఘించినందుకు కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఆఫ్ స్పోర్ట్ (కాస్‌) డోపింగ్ నిరోధక విభాగం ఈ ఏడాది మార్చి 1 ప్రమోద్‌ను స్పెండ్ చేసింది. తన సస్పెన్షన్‌ ఎత్తివేయాలని కాస్‌ను ప్రమోద్‌ కోరాడు. దానిని 29 జూలై 2024న కాస్‌ కొట్టివేసింది’ అని బీడబ్ల్యూఎఫ్‌ ఓ ప్రకటనలో పేర్కొంది.

Show comments