Site icon NTV Telugu

Prakash Raj : నాకు నేషనల్ అవార్డ్ వస్తే ఎవరూ పట్టించుకోలేదు..

Whatsapp Image 2023 10 26 At 1.29.20 Pm

Whatsapp Image 2023 10 26 At 1.29.20 Pm

నేషనల్ అవార్డ్స్ గురించి విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.. 25 సంవత్సరాల క్రితం అంతఃపురం సినిమాకుగాను తనకు నేషనల్ అవార్డు వచ్చిందని, కానీ అప్పుడు తనను టాలీవుడ్ పెద్దలు ఎవరూ కూడా పట్టించుకోలేదని ప్రకాష్ రాజ్ అన్నారు.అల్లు అర్జున్ తో పాటు నేషనల్ అవార్డు వచ్చిన తెలుగు సినీ ప్రముఖులను టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఇటీవల ప్రత్యేకంగా సన్మానించిన విషయం తెలిసిందే.. ఈ వేడుకలో ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్స్ టాలీవుడ్‌లో ఎంతో హాట్ టాపిక్‌గా మారాయి.అల్లు అర్జున్‌కు నేషనల్ అవార్డు రావడం అంటే తెలుగు వారందరికి ఎంతో గర్వకారణమని ప్రకాష్ రాజ్ అన్నారు. ఇలాంటి సన్మాన వేడుకలకు తెలుగు హీరోలతో పాటు ఇండస్ట్రీ పెద్దలు ఎందుకు కలిసిరావడం లేదని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు. అవార్డులు వస్తే ఒకరినొకరు ప్రశంసించుకోవడం మర్చిపోతున్నారని ఆయన అన్నారు..

మన ఇంట్లో వాళ్లని మనం గౌరవించుకోకపోతే అవతలి వాళ్లు మనల్ని ఎలా గౌరవిస్తారని ప్రకాష్ రాజ్ తెలిపారు ఇలాంటి వివక్ష ను భరించలేకే నేను చాలా రోజులుగా సినిమా వేడుకలకు దూరంగా ఉంటున్నానని, కానీ ఈ వేడుక గురించి మైత్రీ మూవీ మేకర్స్ చెప్పగానే వెంటనే వచ్చానని ప్రకాష్ రాజ్ తెలిపారు. ఈ వేడుకకు సీనియర్లు కూడా దూరంగా ఉండటం బాధను కలిగిచిందని ఆయన తెలిపారు.మరోవైపు యంగ్ డైరెక్టర్లు రావడం ఎంతో ఆనందంగా అనిపించిందని ప్రకాష్ రాజ్ తెలిపారు..అల్లు అర్జున్ ఫస్ట్ సినిమా గంగోత్రిలో తాను నటించానని, తనతో కలిసి నటించే సమయంలో ట్రైపాడ్ కెమెరా కింద కూర్చుని ఎంతో టెన్షన్‌ పడుతున్న అల్లుఅర్జున్ ని చూసిన ఆ క్షణాలు ఇంకా గుర్తున్నాయని ప్రకాష్ రాజ్ తెలిపారు, ఆ సమయంలో అల్లుఅర్జున్ కష్టపడాలనే తపన నేను చూసానని , అప్పుడే అతడు ఉన్నత స్థానానికి చేరుకుంటాడని నేను అనుకున్నానని ప్రకాష్ రాజ్ చెప్పాడు. నేషనల్ అవార్డ్‌తో నేటి యువతకు అల్లు అర్జున్ స్ఫూర్తిగా నిలిచాడని ప్రకాష్ రాజ్ తెలిపారు..బన్నీకి నేషనల్ అవార్డు వచ్చిందంటే నా కొడుకు వచ్చినంత ఆనందం ఉందని ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చారు..

Exit mobile version