Site icon NTV Telugu

Prakash Raj: ప్రకాష్ రాజ్ ఇంట్లో తీవ్ర విషాదం..

Prakash Raj

Prakash Raj

Prakash Raj Mother Swarnalatha Passes Away: ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి సువర్ణలత 86 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు. అనారోగ్యం కారణంగా మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇక ఈరోజు(సోమవారం) సాయంత్రం బెంగళూరులో సువర్ణలత అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు కుటుంబీకులు వెల్లడించారు. ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ తల్లి స్వర్ణలత నేపథ్యాన్ని పరిశీలిస్తే… ఆమె హుబ్లీలోని ఒక అనాథ శరణాలయంలో పెరిగారు. నర్సింగ్ విద్య పూర్తి చేసి బ్రతుకుదెరువు కోసం బెంగుళూరు మహా నగరానికి వచ్చారు. స్వర్ణలత క్రైస్తవ మతానికి చెందినవారు కాగా, ప్రకాశ్ రాజ్ తండ్రి మంజునాథ్ రాయ్ హిందువు. భిన్నమైన సంస్కృతులు, మతాల నేపథ్యం ఉన్న కుటుంబంలో ప్రకాష్ రాజ్ పెరిగారు. ఇది ప్రకాష్ వ్యక్తిత్వంలో వైవిధ్యానికి కారణమైంది.

READ MORE: Delhi: ఢిల్లీలో లష్కర్ తోయిబా ఉగ్రవాది అరెస్ట్.. భారీ ఉగ్ర కుట్ర భగ్నం

Exit mobile version