Site icon NTV Telugu

Drishyam 3 : దృశ్యం 3’పై ప్రకాష్ రాజ్ క్లారిటీ

Drushyam 3 Hindhi

Drushyam 3 Hindhi

అజయ్ దేవగన్ హీరోగా రాబోతున్న హిందీ ‘దృశ్యం 3’లో ప్రకాష్ రాజ్ నటిస్తున్నట్లు వస్తున్న వార్తలు నిజమేనని ఆయన స్వయంగా ఖరారు చేశారు. అయితే, గతంలో అక్షయే ఖన్నా చేసిన పాత్రలో ప్రకాష్ రాజ్ కనిపిస్తారని, ఆయన్ని రీప్లేస్ చేస్తారని సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగింది. దీనిపై స్పందించిన ప్రకాష్ రాజ్.. తాను ఎవరినీ రీప్లేస్ చేయడం లేదని, తన పాత్ర పూర్తిగా కొత్తగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సినిమాలో తన రోల్ ప్రతి ఒక్కరికీ నచ్చుతుందని ఆయన కాన్ఫిడెంట్‌గా చెప్పారు. అంటే అక్షయే ఖన్నా పాత్ర కూడా సినిమాలో ఉండే అవకాశం ఉందని, ప్రకాష్ రాజ్ ఒక పవర్‌ఫుల్ కొత్త క్యారెక్టర్‌తో ఎంట్రీ ఇస్తున్నారని అర్థమవుతోంది.

Also Read : Toxic : ‘టాక్సిక్’ ఓవర్సీస్ డీల్ క్లోజ్.. కన్నడ సినిమా చరిత్రలో కనివినీ ఎరుగని రికార్డు!

జీతూ జోసెఫ్ అందించిన అద్భుతమైన కథతోనే ఈ మూడో భాగం కూడా తెరకెక్కుతోంది. అన్ని భాషల్లోనూ ‘దృశ్యం 3’పై భారీ అంచనాలు ఉన్నాయి. అజయ్ దేవగన్ తన ఫ్యామిలీని కాపాడుకోవడానికి ఈసారి ఎలాంటి ప్లాన్స్ వేస్తాడనేది ఆసక్తికరంగా మారింది. ప్రకాష్ రాజ్ లాంటి సీనియర్ నటుడు తోడవడంతో సినిమాపై మరింత బజ్ ఏర్పడింది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు రానున్నాయి. సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి ప్రకాష్ రాజ్ రాక ఒక పెద్ద ప్లస్ పాయింట్ అనే చెప్పాలి.

Exit mobile version