Prakash Raj Faces Defamation Suit: ప్రకాష్ రాజ్‌కు షాక్.. వంద కోట్ల పరువు నష్టం దావా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prakash Raj Faces Defamation Suit: శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచారు సినీ నటుడు ప్రకాష్ రాజ్.. అయితే, వీహెచ్‌పీ, బీజేపీ, హిందూ సంఘాలు ప్రకాష్ రాజ్‌పై తీవ్రస్థాయిలో మండిపుతున్నారు.. శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణులపై ఆయన చేసినట్లు ఆరోపిస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ నేత, టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. ప్రకాష్ రాజ్‌పై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేస్తున్నట్లు ప్రకటించారు. కోట్లాది మంది భక్తులు ఆరాధించే శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణులపై ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఆయన మాట్లాడారని ఆరోపించారు.
Read Also: Hit and Run Case : జూబ్లీహిల్స్ హిట్ అండ్ రన్ కేసులో కీలక మలుపు
Also Read
- Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
- IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
- Chandrababu, Pawan Kalyan Meet: స్థానిక ఎన్నికలపై దృష్టిపెట్టిన చంద్రబాబు, పవన్.. నేడు కూటమి నేతల కీలక భేటీ..
- పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
ప్రకాష్ రాజ్ ఇతర మతాలపై ఇలాంటి వ్యాఖ్యలు చేసే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు భానుప్రకాష్ రెడ్డి. హిందూ దేవతలపై మాత్రమే విమర్శలు చేసి, భక్తుల భావోద్వేగాలను దెబ్బతీసి ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. అలాగే ప్రకాష్ రాజ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నామని చెప్పారు. హిందువులకు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సినిమాల్లో డైలాగులు చెప్పినట్లు బయట మాట్లాడితే ప్రజలు సహించరని హెచ్చరించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రకాష్ రాజ్ నుంచి ఈ అంశంపై స్పందన రావాల్సి ఉంది. మరోవైపు, వీహెచ్‌పీ సైతం ప్రకాష్ రాజ్‌కు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన విషయం విదితమే..
తాజావార్తలు
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
Release Postpones : పెద్ద సినిమాల రిలీజ్ అంటే నమ్మకం లేకుండా పోయిందా?
-
Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
‘Dada’ : ‘దాదా’ ఈజ్ బ్యాక్.. మైసూర్ షూటింగ్లో అడుగుపెడుతున్న నటసింహం
ట్రెండింగ్
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి