విజయవాడ ప్రకాశం బ్యారేజ్ గేట్ రిపేర్ పనులు ఊపందుకున్నాయి. బోట్లు గుద్దుకోవడం వల్ల ప్రకాశం బ్యారేజీ గేట్ -.69 డామేజ్ అయ్యింది. ధ్వంసమైన కౌంటర్ వెయిట్ స్థానంలో వేరే కౌంటర్ వెయిట్ ఏర్పాటు చేయనున్నారు అధికారులు. విరిగిన కౌంటర్ వెయిట్ బండ్ ని వెల్డింగ్ చేసి తొలగించేందుకు చర్యలు చేపట్టారు అధికారులు. విరిగిన కౌంటర్ వెయిట్ బండ్‌ను తప్పించేందుకు క్రేన్ సిద్ధం చేశారు అధికారులు. నిపుణులు కన్నయ్యనాయుడు పర్యవేక్షణలో మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. మరమ్మతు పనులు బెకెమ్ ఇన్ ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చేస్తోంది. బెకెమ్ ఇన్ ఫ్రా ఇప్పటికే.. పోలవరం గేట్లు, పులిచింతల, ప్రాజెక్టుల గేట్లు ఏర్పాటు చేసింది. బ్యారేజీలో ఇరుక్కున్న నాలుగు పడవలను బెకెమ్ ఇన్ ఫ్రా సంస్థ సిబ్బంది తొలగించనున్నారు. తొలుత 67, 69 గేట్లు మూసి ఆ తర్వాత పడవలను తొలగించనున్నారు. ఏడు రోజుల్లో బ్యారేజీ గేట్లు ఏర్పాటు పనులు పనులు పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
Khairatabad Ganesh: నేడు ఖైరతాబాద్ మహాగణపతికి నేత్రాలంకరణ..