Site icon NTV Telugu

Prabhas: విలన్‌గా ప్రభాస్.. థియేటర్లు ఇక ఇన్సూరెన్స్ చేయించుకోవాలమ్మా!

Prabhas Craze

Prabhas Craze

Prabhas vs Prabhas in Sandeep Reddy Vanga Spirit Film: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేసే సినిమాల జానర్స్ తీసుకుంటే.. ఒక్కోదానికి అసలు సంబంధమే లేదు. బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన సినిమాలు వేటికవే ప్రత్యేకంగా నిలిచాయి. సాహో కమర్షియల్ సినిమా కాగా, రాధేశ్యామ్ లవ్ స్టోరీగా, ఆదిపురుష్ రామాయణం ఆధారంగా తెరకెక్కింది. ఈ సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ.. ఇటీవల వచ్చిన సలార్, కల్కి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ప్రభాస్ సత్తా ఏంటో చూపించాయి. సలార్ హై ఓల్టేజ్ యాక్షన్‌ ఎంటర్టైనర్‌గా తెరకెక్కగా.. కల్కి మెథలాజికల్ సైన్స్ ఫిక్షనల్ మూవీగా వచ్చి.. ఏకంగా ప్రభాస్‌కు రెండో వెయ్యి కోట్ల సినిమగా నిలిచింది. ఇలా ఒక్కో సినిమాతో డిఫరెంట్ అటెంప్ట్ చేస్తున్న ప్రభాస్ అప్ కమింగ్ మూవీస్‌లలో రాజాసాబ్‌లో లవర్ బాయ్‌గా, ఫౌజీలో సైనికుడిగా కనిపించబోతున్నాడు.

Nirmal Benny: ఇండస్ట్రీలో విషాదం.. గుండెపోటుతో నటుడు మృతి

ఇక సందీప్ రెడ్డి వంగతో చేయనున్న స్పిరిట్ మూవీలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించబోతున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మామూలుగానే ప్రభాస్‌ను తట్టుకోలేరు. అలాంటిది డ్యూయెల్ రోల్, అందులోను నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో విలన్‌గా నటిస్తే.. థియేటర్లు తగలబడిపోతాయ్ అని చెప్పడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. ఇప్పుడు సందీప్ రెడ్డి.. ప్రభాస్‌ను స్పిరిట్‌లో హీరోగా, విలన్‌గా చూపించబోతున్నాడట. ఒకవేళ ఇదే నిజమైతే.. స్పిరిట్‌ ఊహకందని విధంగా ఉంటుందనే చెప్పాలి. అనిమల్ సీక్వెల్‌ను రణ్‌బీర్ వర్సెస్ రణ్‌బీర్‌గా ప్లాన్ చేస్తున్న సందీప్.. దానికంటే ముందే ప్రభాస్ వర్సెస్ ప్రభాస్‌గా ప్లాన్ చేస్తాడేమో చూడాలి. అన్నట్టు.. ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటిస్తుందని.. ఆమె కూడా నెగిటివ్ రోల్‌లో కనిపిస్తుందనే ప్రచారం జరుగుతోంది. మరి సందీప్ ఏం ప్లాన్ చేస్తున్నాడో చూడాలి.

Exit mobile version