Site icon NTV Telugu

The Raja Saab Box Office Collection Day 2: ‘ది రాజా సాబ్’ డే 2 కలెక్షన్స్ రిపోర్ట్ ఇదే.. అంచనాలు ఫలించేనా?

The Rajasaab

The Rajasaab

The Raja Saab Box Office Collection Day 2: ప్రభాస్ నటించిన తాజా హారర్–ఫాంటసీ చిత్రం ‘ది రాజా సాబ్’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. విడుదలైన తొలి రోజుల్లోనే భారీ వసూళ్లు సాధించిన ఈ సినిమా భారత్‌లో త్వరలోనే రూ.100 కోట్ల మార్క్‌ను చేరువకానుంది. ఇండస్ట్రీ ట్రాకర్ సాక్‌నిల్‌క్ (Sacnilk) సమాచారం ప్రకారం.. శుక్రవారం అన్ని భాషల్లో కలిపి రూ.53.75 కోట్లు వసూలు చేసింది. అయితే రెండో రోజు శనివారం వసూళ్లలో కొంత తగ్గుదల కనిపించింది. దాదాపు 50 శాతం డ్రాప్‌తో డే 2కి రూ.27.85 కోట్లు మాత్రమే రాబట్టింది.

READ MORE: Parvathy : చిన్నప్పుడే లైంగిక వేధింపులు.. ఆ నొప్పితో కుంగిపోయా..స్టార్ హీరోయిన్

ఇప్పటికే ‘ది రాజా సాబ్’ తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.112 కోట్లు గ్రాస్ కలెక్షన్లు సాధించి రికార్డు సృష్టించింది. ఈ సందర్భంగా మేకర్స్ సోషల్ మీడియాలో స్పందిస్తూ.. “హారర్ ఫాంటసీ జానర్‌లో కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేశాం. #TheRajaSaab డే 1 వరల్డ్‌వైడ్ గ్రాస్ రూ. 112 కోట్లకు పైగా ఉంది. ఈ జానర్‌లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఇదే” అని ప్రకటించారు. అయితే.. డే 2న తెలుగు వెర్షన్ మొత్తం ఆక్యుపెన్సీ 44 శాతంగా నమోదైంది. హిందీ వెర్షన్‌లో 12.95%, తమిళ వెర్షన్‌లో 21.11% ఆక్యుపెన్సీ నమోదైంది. అయితే.. సినిమా విడుదలకు ముందు నుంచే మంచి హైప్ క్రియేట్ అయింది. మొత్తం 3,615 షోల్లో 1,29,454 టికెట్లు అమ్ముడుపోయి రూ.3.55 కోట్లు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా వచ్చాయి. బ్లాక్ చేసిన సీట్లు కలిపితే ఈ మొత్తం రూ.8.62 కోట్లకు చేరింది. ఈ వసూళ్లు చూస్తుంటే సినిమా టీం అంచనాలు ఫలించేలా కనిపించడం లేదని సినీ వర్గాల అంచనా.

Exit mobile version