NTV Telugu Site icon

Prabhas – Surya : ‘ప్రభాస్-సూర్య’ కాంబో సెట్.. కానీ బిగ్ ట్విస్ట్?

New Project (47)

New Project (47)

Prabhas – Surya :ప్రభాస్, సూర్య కలిసి సినిమా చేస్తే ఎలా ఉంటుందో.. అంచనా కూడా వేయలేం. అయితే.. ఈ ఇద్దరి కాంబో సెట్ అవడం కష్టమే. గతంలో ఇలాంటి రూమర్స్ వచ్చినప్పటికీ.. కుదరలేదు. కానీ ఈసారి మాత్రం ఈ క్రేజీ కాంబో సెట్ అయినట్టుగా తెలుస్తోంది. కానీ మల్టీస్టారర్ మూవీ కాదు. ఇద్దరు ఒకే స్క్రీన్ పై కనిపించే ఛాన్స్ ఉంది కానీ, ఇద్దరు ఒకే సీన్‌లో కనిపిస్తారా? లేదా? అనేది మాత్రం చెప్పలేం. అసలు ఈ ఇద్దరు నిజంగానే ఆ సినిమాలో కనిపిస్తారా? అంటే, అది కూడా ఖచ్చితంగా చెప్పలేం. కానీ బాలీవుడ్ వర్గాల ప్రకారం ఈ ఇద్దరు గెస్ట్ రోల్ చేయడానికి ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న సినిమాల్లో క్రేజీ సీక్వెల్ ‘సింగం అగైన్’ మోస్ట్ అవైటేడ్ మూవీగా ఉంది. అజయ్ దేవగన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను యాక్షన్ డైరెక్టర్ రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్నాడు. వచ్చే దీపావళికి ఈ సినిమా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు.

Read Also:Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేష్‌ ప్రత్యేకత.. ఏడు ముఖాలు, ఏడు సర్పాలు, 24 చేతులు..

ఈ సినిమాలోనే ప్రభాస్, సూర్య గెస్ట్ రోల్ చేస్తున్నట్టుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. రీసెంట్‌గా రోహిత్ శెట్టి, కల్కి మ్యూజిక్‌ను వాడూతూ ఒక వీడియో రిలీజ్ చేయగా.. ప్రభాస్ ‘సింగం అగైన్‌’లో క్యామియో ఇస్తున్నాడనే టాక్ మొదలైంది. ఇక ఇప్పుడు ఒరిజినల్ సింగం సూర్య కూడా ఈ సినిమాలో క్యామియో రోల్స్ చేస్తున్నాడనే న్యూస్ వైరల్ అవుతోంది. సూర్య చేసిన సింగం సిరీస్ ఇక్కడ సూపర్ హిట్ అయింది. ఇదే సిరీస్‌ను బాలీవుడ్‌లో చేయగా బ్లాక్ బస్టర్ అయింది. దీంతో.. ఇప్పుడు సూర్య కూడా ఈ సినిమాలో కనిపించే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇందులో నిజమెంతో తెలియదు గానీ.. ప్రభాస్, సూర్య ఒకే సినిమాలో కనిపిస్తే మామూలుగా ఉండదనే చెప్పాలి. గతంలో ప్రభాస్ ‘యాక్షన్ జాక్సన్’ అనే బాలీవుడ్‌ సినిమాలో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చాడు. రీసెంట్‌గా సూర్య ‘సర్ఫిరా’ సినిమాలో క్యామియో ఇచ్చాడు. ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి ‘సింగం’ కోసం రంగంలోకి దిగుతున్నారని చెబుతున్నారు. మరి ఇందులో ఎంత వరకు నిజముందో చూడాలి.

Read AlsoPope Francic : ఇండోనేషియాలో పోప్ ఫ్రాన్సిస్‌పై దాడి.. ఏడుగురు నిందితులు అరెస్ట్

Show comments