పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన బ్లాక్‍బాస్టర్ మూవీ ‘సలార్ సీజ్‍ఫైర్ 1’.. కేజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హైవోల్టేజ్ యాక్షన్ డ్రామాగా సలార్ మూవీ తెరకెక్కింది. ఈ సినిమాలో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ లలో ప్రభాస్ అదరగొట్టారు.సలార్ సినిమాలో దేవాగా ప్రభాస్ మరియు వరదరాజ మన్నార్‌గా పృథ్విరాజ్ సుకుమారన్ నటించారు. శృతి హాసన్, జగపతి బాబు, ఈశ్వరి రావు, టినూ ఆనంద్, దేవరాజ్ మరియు బాబి సింహా ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీకి రవి బస్రూర్ సంగీతం అందించారు. హెంబాలే ఫిల్మ్స్ భారీ బడ్జెట్ తో ఎంతో గ్రాండ్ గా ఈ మూవీని నిర్మించింది.గత ఏడాది డిసెంబర్ 22వ తేదీన రిలీజైన ఈ చిత్రం భారీ కలెక్షన్లతో దుమ్మురేపింది. సుమారు రూ.700కోట్లకు పైగా వసూళ్లతో అదరగొట్టింది.ఇదిలా ఉంటే సలార్ మూవీ రిలీజై నెల రోజులు కాకుండానే ఓటీటీలోకి వచ్చేసింది.
నేడు (జనవరి 20) ఈ మూవీ నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ మరియు మలయాళంలో కూడా ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. సలార్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ గురించి హీరో ప్రభాస్ మాట్లాడిన వీడియోను నెట్‍ఫ్లిక్స్ రిలీజ్ చేసింది.”యాక్షన్ ఫ్లిక్స్ సలార్‌ను ఇప్పుడు నెట్‍ఫ్లిక్స్‌లో చూడండి. ఎంజాయ్ చేయండి” అని ప్రభాస్ అన్నారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో నెట్‍ఫ్లిక్స్ పోస్ట్ చేసింది. “దేవరథ రైజర్ (ప్రభాస్) నుంచి ఓ అనౌన్స్‌మెంట్ ఉంది. ప్లీజ్.. వీ.. కైండ్లీ.. రిక్వెస్ట్.. ఆయన మాట వినండి. సలార్ మూవీ తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళం భాషల్లో నెట్‍ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది” అని నెట్‍ఫ్లిక్స్ ట్వీట్ చేసింది.సలార్ మూవీని అనుకున్న సమయం కంటే ముందుగానే నెట్‍ఫ్లిక్స్ స్ట్రీమింగ్‍కు తీసుకొచ్చింది. అయితే, సలార్ మూవీ హిందీ వెర్షన్ మాత్రం ఇంకా స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి రాలేదు. హిందీ వెర్షన్ కాస్త ఆలస్యంగా రానుందని సమాచారం. హిందీ వెర్షన్‍ను నెట్‍ఫ్లిక్స్ మార్చిలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు సమాచారం.
Devaratha Raisaar has an announcement, please…we…kindly…request…to hear him out.#Salaar is now streaming on Netflix in Telugu,Tamil, Malayalam and Kannada.#SalaarOnNetflix pic.twitter.com/othQ2jOxPE
— Netflix India South (@Netflix_INSouth) January 20, 2024
