Site icon NTV Telugu

Prabhas : డార్లింగ్‌కు జక్కన్న పంపిన స్పెషల్ లేఖ..వైరల్

Prabas Latter Jakkana

Prabas Latter Jakkana

దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తనదైన స్టైల్‌లో సినిమాలు తీసి గ్లోబల్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే, ఆయన హీరోలు కూడా అంతర్జాతీయ స్థాయిలో సెటిల్ అయ్యారు. అందులో మొదటి స్థానంలో ఉంది మాత్రం మన డార్లింగ్ ప్రభాస్ . ‘బాహుబలి’ సినిమా పుణ్యమా అని జపాన్‌లో ప్రభాస్‌కు విపరీతమైన అభిమానం, క్రేజ్ దక్కాయి. ఇక రీసెంట్‌గా, ‘బాహుబలి’ రెండు సినిమాలను కలిపి ‘బాహుబలి ది ఎపిక్’ పేరుతో జపాన్‌లో విడుదల చేయగా, ప్రభాస్, నిర్మాత శోభు యార్లగడ్డ ప్రత్యేక ప్రీమియర్‌కు హాజరయ్యారు. అక్కడ ఈ క్రేజ్ ఎంత ఉందో తెలుపుతూ, ప్రభాస్ రాజమౌళి రాసిన ఒక లేఖను అభిమానులతో పంచుకున్నారు.

ఆ లేఖలో రాజమౌళి చెప్పిన విషయం ఏంటంటే… ఆయన ఇప్పటికి నాలుగు సార్లు జపాన్‌కు వెళ్లారట. ప్రతిసారీ అక్కడ ప్రేక్షకుల నుంచి ఎదురయ్యే ప్రశ్న ఒకటేనట.. ‘ప్రభాస్ ఎప్పుడు ఇక్కడికి వస్తున్నారు?’ అని అడుగుతూ ఉంటారు. అందుకే, ‘నా బాహుబలి ఇప్పుడు తన రెండో ఇంటికి వచ్చాడు. ఈ పర్యటనను బాగా ఎంజాయ్ చేస్తున్నావని అనుకుంటున్నాను’ అని రాజమౌళి ప్రేమగా రాశారు. దీనికి ప్రభాస్ కూడా ఎంతో సంతోషంగా స్పందిస్తూ, ‘రాబోయే రోజుల్లో మనమిద్దరం కలిసి జపాన్‌కు వెళ్దాం’ అని పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. జపాన్ ప్రేక్షకులకు ప్రభాస్ అంటే ఎంత ఇష్టమో చెప్పడానికి ఈ ఒక్క విషయం చాలు కదా.

 

Exit mobile version