NTV Telugu Site icon

Salaar 2: ప్రభాస్ సలార్ 2 లో పాన్ ఇండియా విలన్?

Salaar2

Salaar2

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గత ఏడాది వచ్చిన సలార్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు.. ఆ సినిమా మంచి కలెక్షన్స్ ను కూడా అందించింది.. ఆ సినిమాతో ప్రభాస్ హిట్ ట్రాక్ మళ్ళీ మొదలైంది.. కేజీఎఫ్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో ఈ సినిమా వచ్చింది.. మొదటి పార్ట్ సూపర్ హిట్ అవ్వడంతో ఇప్పుడు పార్ట్ 2 రాబోతుంది.. ఈ సినిమా పై రోజుకో వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. తాజాగా ఈ మూవీలో విలన్ ఇతనే అంటూ ఓ వార్త వినిపిస్తుంది..

ఇక ఈ మూవీలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా, హోంబేలె ఫిలిమ్స్ వారు నిర్మించడం జరిగింది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాపై రిలీజ్ సమయంలో ఎంత భారీ అంచనాలుండేవో తెలిసిందే..అంతేకాదు వరల్డ్ వైడ్ గా దాదాపు 700 కోట్ల వరకు వసూల్ చేసి రికార్డ్ బ్రేక్ చేసింది. ఇక ఈ సినిమా రెండో పార్ట్ గా త్వరలోనే సలార్ పార్ట్ 2 గా “శౌర్యంగ పర్వం” తెరకెక్కనున్న విషయం తెలిసిందే..

ప్రస్తుతం ప్రభాస్ కల్కి సినిమాలో నటిస్తున్నాడు.. ఆ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ఈ సినిమా తర్వాత మరో రెండు సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. ఆ సినిమాల తర్వాత సలార్ 2 సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు.. సలార్ 2 లో మరో పాన్ ఇండియా విలన్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.. నాని దసరా మూవీలో విలన్ గా చేసి మెప్పించిన “షైన్ టామ్ చాకో” ఈ సినిమాలో విలన్ గా చెయ్యనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజమేంత ఉందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చెయ్యాల్సిందే..

Show comments