NTV Telugu Site icon

Kalki 2898AD : ‘కల్కి’ సినిమాలో కృష్ణుడిగా నటించింది ఈయనే.. తన బ్యాక్ గ్రౌండ్ ఇదే

New Project (1)

New Project (1)

Kalki 2898AD : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి 2898AD సినిమా ప్రస్తుతం సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. సినిమాలోని విజువల్స్, యాక్షన్ సీన్స్, మహాభారతం సీన్లు చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. దర్శకుడు నాగ అశ్విన్ టేకింగ్ కి మంత్రముగ్ధులు అయిపోతున్నారు. కలియుగాంతానికి, మహాభారతానికి లింక్ పెట్టడం చూసి వాట్ ఏ బ్రెయిన్ అంటూ ఆయనను తెగ పొగిడేస్తున్నారు. ఇప్పటికే కల్కి సినిమా కలెక్షన్స్ లో కూడా దూసుకుపోతుంది. కల్కి సినిమాలో ముఖ్యంగా కురుక్షేత్ర యుద్ధంలో కొన్ని సీన్లను చూపించారు. దీంతో మహాభారతంలోని కృష్ణుడు, అర్జునుడు, కర్ణుడు, ఉత్తర, అశ్వత్థామ పాత్రలను చూపించారు. ఉత్తరగా మాళవిక నాయర్, అర్జునుడిగా విజయ్ దేవరకొండ, కర్ణుడిగా ప్రభాస్, అశ్వత్థామగా అమితాబ్ కనిపించారు. అయితే కృష్ణుడి పాత్రను మాత్రం ఫేస్ కనిపించకుండా కేవలం అతని ఆహార్యం మాత్రమే కనిపించేలా తెరకెక్కించారు. ఆ సమయంలో కృష్ణుడి పాత్రకు డైలాగ్స్ మాత్రం ఇచ్చారు.

Read Also:Chandrababu: నేడు వైద్యారోగ్య శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి సమీక్ష..

కల్కి సినిమాలో కృష్ణుడు పాత్రలో నటించింది ఒకరైతే ఆయను వాయిస్ ఇచ్చింది మాత్రం ఇంకొకరు. కల్కి సినిమాలో కృష్ణుడి పాత్రలో కృష్ణకుమార్ అనే నటుడు నటించారు. థియేటర్ ఆర్టిస్ట్ గా పలు నాటకాల్లో నటించారు కృష్ణ కుమార్.. ఇప్పుడిప్పుడే ఆయన సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటున్నారు. ఆయన పలు తమిళ సినిమాల్లో నటించాడు. సూర్య నటించిన ఆకాశమే నీ హద్దురా సినిమాలో ఫైలట్ పాత్రలో కనిపించాడు. ధనుష్ మారన్ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా నటించాడు. ఇప్పుడు ఇలా కృష్ణుడి పాత్రలో కనపడి అలరించాడు. మరి కల్కి పార్ట్ 2లో కృష్ణుడి పాత్ర ఉంటుందని తెలుస్తోంది. మరి ఇతనే పార్ట్ 2లో ఉంటాడా.. అప్పుడు కూడా ఫేస్ కనిపించకుండా చూపిస్తారా తెలియాలి. ఇక కృష్ణుడి పాత్రలో కృష్ణ కుమార్ నటిస్తే వాయిస్ ఇచ్చింది మాత్రం వేరే యాక్టర్. తమిళ్ లో ప్రస్తుతం విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోగా దూసుకుపోతున్న అర్జున్ దాస్.. కల్కి సినిమాలో కృష్ణుడి పాత్రకు తెలుగు, హిందీ భాషల్లో వాయిస్ ఇచ్చారు. అర్జున్ దాస్ మాస్టర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. పవన్ కళ్యాణ్ OG సినిమాలో కూడా నటిస్తున్నాడు.

Read Also:Kalki First Day Collections : అదరగొట్టిన భైరవ.. ఫస్ట్ డే కల్కి 2898AD సినిమా కలెక్షన్స్ ఎంతో తెలుసా ?