Site icon NTV Telugu

Kalki First Day Collections : అదరగొట్టిన భైరవ.. ఫస్ట్ డే కల్కి 2898AD సినిమా కలెక్షన్స్ ఎంతో తెలుసా ?

Kalki 2898 Ad Tickets

Kalki 2898 Ad Tickets

Kalki First Day Collections : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రం కల్కి 2898AD. ఈ సినిమా గురువారం ప్రపంచ వ్యాప్తంగా చాలా గ్రాండ్ గా విడుదలైంది. ఫస్ట్ షో నుంచి అన్నిచోట్ల ఫుల్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. సినిమాలోని విజువల్స్, యాక్షన్ సీన్స్, మహాభారతం సీన్స్ చూసి ప్రేక్షకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మహాభారతానికి, కలియుగాంతానికి లింక్ పెట్టి డైరెక్టర్ నాగ్ అశ్విన్ అదిరిపోయే మూవీ తీశారని ప్రేక్షకులు అంటున్నారు. ఇక మరోవైపు కల్కి సినిమా కలెక్షన్లలో దూసుకుపోతుంది. ఇప్పటివరకు అమెరికా కలెక్షన్స్ మాత్రమే అధికారికంగా ప్రకటించారు. నార్త్ అమెరికాలో కల్కి సినిమా ఇప్పటివరకు దాదాపు 5.1 మిలియన్ డాలర్లకు పైగా కలెక్ట్ చేసి అమెరికాలో హయ్యస్ట్ ఓపెనింగ్ తెలుగు మూవీగా నిలిచింది. మన లెక్కల్లో అమెరికాలో కల్కి దాదాపు రూ.45 కోట్లు కలెక్ట్ చేసినట్లు. కల్కి 2898AD సినిమా ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు 200 కోట్లు వస్తుందని ముందు నుంచి ట్రేడ్ వర్గాలు అంచనా వేశారు.

Read Also:Vijay: మంచి మనసు చాటుకున్న హీరో విజయ్.. విద్యార్థులకు ప్రోత్సాహం

ప్రస్తుతానికి మూవీ యూనిట్ అధికారికంగా కలెక్షన్లను ఇంకా ప్రకటించలేదు. బాక్సాఫీస్ సమాచారం ప్రకారం కల్కి సినిమా తెలుగులో రూ.70 కోట్లు, హిందీలో రూ.25 కోట్లు, మిగిలిన భాషల్లో రూ.10 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించినట్టు తెలుస్తుంది. ఇండియాలో కల్కి సినిమా దాదాపు రూ.115 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసినట్లు తెలుస్తోంది. అమెరికా, ఓవర్సీస్ కలుపుకొని కల్కి ప్రపంచవ్యాప్తంగా రూ.180 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు తెలుగులో మొదటిరోజు అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా ఆర్ఆర్ఆర్ సినిమా రూ. 223 కోట్లతో మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత బాహుబలి 2 రూ. 217 కోట్లతో రెండో స్థానంలో నిలిచింది. అయితే ఈ రెండిటిని కల్కి సినిమా బ్రేక్ చేయలేదని తెలుస్తోంది. మూడో ప్లేస్ లో నిలుస్తుందని అనుకుంటున్నారు. అయితే అధికారిక కలెక్షన్స్ వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే.

Read Also:Delhi Rains : మొదటి వర్షానికే ఢిల్లీలో వరదలు.. నీట మునిగిన వాహనాలు.. భారీ ట్రాఫిక్ జామ్

Exit mobile version