NTV Telugu Site icon

Kalki 2898 AD : కల్కి టికెట్స్ కోసం ప్రభాస్ అభిమానుల మౌన దీక్ష..

Kalki (5)

Kalki (5)

Kalki 2898 AD : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ “కల్కి 2898 AD “..ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు ,ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 న ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ ,గ్లింప్సె సినిమాపై భారీగా అంచనాలు పెంచేసింది.రీసెంట్ గా రిలీజ్ అయిన రిలీజ్ ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలు తారా స్థాయికి తీసుకోని వెళ్లాయి.ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ మొదలైంది.అలాగే తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు టికెట్స్ రేట్స్ పెంపుదలకు అనుమతి ఇస్తూ చిత్ర యూనిట్ కు గుడ్ న్యూస్ చెప్పాయి.దీనితో కల్కి సినిమా టికెట్స్ హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోతున్నాయి.

Read Also :Double Ismart : డబుల్ ఇస్మార్ట్ ‘మ్యూజిక్ జాతర’ లోడింగ్..

ఈ సినిమా ఓవర్సీస్ బుకింగ్ ఎప్పుడో మొదలవగా రేపు ఘనంగా ఈ సినిమా ప్రీమియర్ షోస్ మొదలు కానున్నాయి.ఇదిలా ఉంటే ప్రభాస్ కల్కి సినిమా టికెట్స్ కోసం ప్రభాస్ అభిమానులు వైజయంతి మూవీస్ ఆఫీస్ ముందు కూర్చుని మౌన దీక్ష చేసారు.తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికే బుకింగ్ మొదలు కాగా కొన్ని చోట్ల మాత్రం బుకింగ్ ఓపెన్ అవ్వలేదు.దీనితో అసహనానికి గురైన ప్రభాస్ ఫ్యాన్స్ నిర్మాత ఆఫీస్ ముందు బైఠాయించి మౌన దీక్ష చేసారు.దీనిపై నెటిజన్స్ భిన్నముగా స్పందిస్తున్నారు.లేట్ అయిన రిలీజ్ కు ముందు రోజైన ఈ సినిమా టికెట్స్ ఇస్తారుగా ఎందుకు ఇలా చేస్తున్నారని కొంతమంది కామెంట్స్ చేయగా మరి కొంతమంది వీరికి సపోర్ట్ గా కామెంట్స్ చేస్తున్నారు