NTV Telugu Site icon

Earthquake: మొరాకోలో భారీ భూకంపం.. 296 మంది మృతి

Earthquake

Earthquake

Earthquake: ఆఫ్రికా దేశమైన మొరాకోలో అర్థరాత్రి బలమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలు మీద 6.8 తీవ్రతతో వచ్చిన భూకంపం భారీ విధ్వంసం సృష్టించింది. ఇప్పటి వరకు దాదాపు 300 మంది మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. పెద్ద సంఖ్యలో ఇళ్లు ధ్వంసమయ్యాయి. శిథిలాలలో ప్రజలు కూరుకుపోయే అవకాశం ఉంది. ప్రజలు గాఢ నిద్రలో ఉన్న సమయంలో బలమైన భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం.. మొరాకోలోని మరాకేష్ నగరానికి 71 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు చెబుతున్నారు. రెస్క్యూ టీమ్ ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు కొనసాగిస్తోంది. భూకంప కేంద్రం భూమికింద 18.5 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు చెబుతున్నారు. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 11 గంటలకు ప్రకంపనలు సంభవించాయి. మరకేష్ నగరంలో పెద్ద సంఖ్యలో ఇళ్లు కూలిపోయాయి. విపత్తు అనంతరం స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. విధ్వంసానికి సంబంధించిన దృశ్యం సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన వీడియోలో చూడవచ్చు. రోడ్లపై చెత్తాచెదారం పేరుకుపోయింది.

Read Also:RBI Data: పెరిగిన విదేశీ మారక నిల్వలు.. ఫారెక్స్ నిల్వలు 599 బిలియన్ డాలర్లు

భూకంపం సంభవించిన వెంటనే స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ప్రజలు ఇళ్లను వదిలి వీధుల్లోకి వచ్చారు. స్థానిక వ్యక్తి మాట్లాడుతూ, భూకంపం సంభవించిన కొద్దిసేపటికే వీధుల్లో చాలా అంబులెన్స్‌లు కనిపించాయని, పడిపోయిన భవనాలలో ఇంకా చాలా మంది శిథిలాల కింద చిక్కుకునే అవకాశం ఉందని చెప్పారు. కాగా, మొరాకో భూకంపంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం వ్యక్తం చేశారు. మొరాకోకు అన్ని విధాలుగా సహాయం చేయడానికి భారతదేశం సిద్ధంగా ఉందని చెప్పారు. గత 120 ఏళ్లలో ఈ ప్రాంతంలో ఇంతటి తీవ్రతతో భూకంపాలు సంభవించలేదు. ఇంతకు ముందు దేశంలో ఎలాంటి భూకంపాలు సంభవించినా తూర్పు ప్రాంతాల్లోనే సంభవించాయి. భూకంపం వచ్చిన తర్వాత కూడా జనాల్లో భయాందోళనలు నెలకొని తిరిగి ఇళ్లకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు.

Read Also:ATM Franchise: అదిరిపోయే ఐడియా.. ఏటీఎం ఫ్రాంఛేజీతో నెలకు రూ.70,000 సంపాదించండి

Show comments