Zelensky: యుద్ధం ప్రారంభమై కొన్ని నెలలైనా ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. కొన్ని స్థలాలు, సముదాయాల లక్ష్యంగా అటాక్ చేస్తోంది. తాజాగా ఉక్రెయిన్ విద్యుత్ సముదాయాలే లక్ష్యంగా రష్యా దాడికి తెగబడింది. దీంతో ఉక్రెయిన్‌లోని చాలా ప్రాంతాల్లో అంధకారం నెలకొంది. ఉక్రెయిన్ ప్రధాన నగరాలు కీవ్, ఎల్వివ్ ప్రాంతాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. ఆ ప్రాంత ప్రజలు చీమ్మ చీకటిలో ఉంటున్నారు. మరోవైపు అక్కడ విద్యుత్ పునరుద్దరణ కోసం అధికారులు ప్రయత్నిస్తూనే ఉన్నారు.
Pele Death: ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజ ఆటగాడు పీలే కన్నుమూత
రష్యా దాడుల తర్వాత చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తెలిపారు. కానీ త్వరలోనే పునరుద్దరణ జరుగుతుందని తెలిపారు. దేశవ్యాప్తంగా రష్యా క్షిపణి దాడులతో గడ్డకట్టే ఉష్ణోగ్రతలతో చాలా ప్రాంతాలు విద్యుత్తు లేకుండా పోయాయని జెలెన్‌స్కీ ఆవేదన వ్యక్తం చేశారు. రష్యా చర్చలకు సిద్ధమంటూనే ఇలా దాడులు చేస్తోందని ఆయన వాపోయారు. శుక్రవారం సాయంత్రం నాటికి ఉక్రెయిన్‌లోని చాలా ప్రాంతాలలో విద్యుత్తు అంతరాయాలు ఉన్నాయన్నారు. ముఖ్యంగా దేశంలో ప్రధాని ప్రాంతాలైన కీవ్, ఎల్వివ్, ఒడెస్సా, ఖేర్సన్, విన్నిట్సియా, ట్రాన్స్‌కార్పతియా ప్రాంతాల్లో విద్యుత్ లేకపోవడంతో ప్రజలు గడ్డకట్టే చలిలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రతి క్షిపణి దాడితో రష్యా తనను తాను బలహీనపరచుకుంటోందన్నారు. వారి క్షిపణులు తగ్గుతున్నాయని జెలెన్‌స్కీ చెప్పారు.