Pothina Mahesh: జనసేన పార్టీ ఎందుకు పెట్టారు.. పవన్ కళ్యాణ్ ఎజెండా ఏంటో చెప్పాలని వైసీపీ నేత పోతిన మహేష్ ప్రశ్నించారు. ఆయన ఏజెండా చంద్రబాబు పల్లకి మోయడమేనని.. ఏజెండా చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడమేనని ఎద్దేవా చేశారు. కాపులను మోసం చేస్తున్న పవన్ కళ్యాణ్.. జనసేన పార్టీ నుంచి ఉమ్మడి 10 జిల్లాల్లో పోటీ చేయడం లేదన్నారు. జనసేన నుంచి చాలా మంది వైసీపీ పార్టీలో కి వస్తున్నారన్నారు. విశాఖపట్నం మినహా ఇంకా ఎక్కడ జనసేన పార్టీ కనపడడం లేదన్నారు. చంద్రబాబు దగ్గర పవన్ కళ్యాణ్ ప్యాకేజీ తీసుకున్న మాట వాస్తవమని.. పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో కలిసాక ఎన్ని ఆస్తులు కొన్నాడో చెప్పాలన్నారు. లేకపోతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్టంలో బినామీలతో సహా బయట పెడతానని హెచ్చరించారు. జనసేన పార్టీ అకౌంట్‌లో ఎంత అమౌంట్ ఉందో చెప్పాలన్నారు. గతంలో మంగళగిరి స్థలం కొనడానికి మీకు డబ్బులు ఎక్కడి ఉంచి వచ్చాయో చెప్పాలని ప్రశ్నించారు. ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా ఎంత సేకరించారో వెబ్ సైట్‌లో పెట్టాలన్నారు.
Read Also: Madhya Pradesh: కాంగ్రెస్కు బిగ్ షాక్.. బీజేపీలో చేరిన 100 మంది కీలక నేతలు..
కౌలు రైతులను కాపాడడానికి మొదటి 5 కోట్లు ఇచ్చారు.. విదేశీయుల నుంచి 15 కోట్లు వసూల్ చేశారు.. ఇంకా చాలా మంది దగ్గర విరాళాలు సేకరించారన్నారు. మరి ఆ డబ్బులు మొత్తం ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. మాట మాటకి నేను నిజాయితీ పరుడుని అని చెప్తున్నావ్ కదా మరి ఎందుకు ఇవ్వి అన్ని బహిర్గతం చేయడం లేదన్నారు. తిరుపతి దేవస్థానంకి ఒక్క రూపాయి కూడా ఇవ్వని నువ్వు.. ఖాజా దగ్గర దశవతారం టెంపుల్‌కి మాత్రమే విరాళాలు ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నలు గుప్పించారు. మీకు విరాళాలు ద్వారా వచ్చిన డబ్బులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. హరిహర వీరమల్లు సినిమా 4 సంవత్సరాల నుంచి చేస్తున్నారని.. అసలు ఆ సినిమా ప్రొడ్యూసర్ ఎవరు.. ఆ సినిమా తరువాత చాలా సినిమాలు పూర్తి చేశారన్నారు. మీ బ్లాక్ మనీ మొత్తం హరిహర వీరమల్లు సినిమా మీద పెడుతున్న మాట వాస్తవమా కాదా అంటూ ప్రశ్నించారు.
