Site icon NTV Telugu

Postal Jobs 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పోస్టల్ శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీ..

Post Office

Post Office

నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. పలు శాఖల్లో పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 55 వేల పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. పదవ తరగతి పూర్తి చేసిన అభ్యర్థులు 81వేల వరకు జీతం పొందవచ్చు. ప్రస్తుతం భారత్ అంతట పెద్ద సంఖ్యలో ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలను ప్రతి ఏటా భర్తీ చేస్తున్నారు.. ఈ పోస్టుల పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

పోస్టుల వివరాలు..

పోస్టల్ అసిస్టెంట్, పోస్ట్ మాన్, సార్టింగ్ అసిస్టెంట్, మెయిల్ గార్డ్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనే ఐదు విభాగాల్లో మొత్తం 55,000 మంది అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ నెలలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది..

జీతం..

పోస్టులకు కనీస వేతనంగా 20,000 నుండి 25,000, పోస్ట్ మాన్ మరియు మెయిల్ గార్డులకు 81,100 , మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కు 21 700 నుండి 69,100 జీతం 18 వేల నుంచి 56,900 వరకు ఉంటుంది..

వయోపరిమితి..

18 నుండి 27 సంవత్సరాలు ఉండాలి. మల్టీ టాస్కింగ్ సిబ్బందికి 18 నుండి 25 సంవత్సరాల వయసు పరిమితి ఉండాలి..

విద్యార్హతలు..

పోస్టల్ అసిస్టెంట్ మరియు సార్టింగ్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు పోస్ట్ మాన్ మరియు మెయిల్ గార్డులకు 12వ తరగతి మరియు మల్టీ టాస్కింగ్ సిబ్బందికి పదవ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి..

ఈ పోస్టుల పై ఆసక్తి కలిగిన అభ్యర్థులు https://www.indiapost.gov.in/ వెబ్ సైట్ ను సందర్శించాలి..

Exit mobile version