POMIS: ఎలాంటి శ్రమ లేకుండా ప్రతి నెలా ఇంట్లో కూర్చుని మంచి ఆదాయం ఎలా పొందాలా అని ఆలోచిస్తున్న వారికి ఒక ప్రభుత్వ పథకం ప్రయోజనకరంగా మారనుంది. ఈ పథకంలో ఒకేసారి డబ్బు పెట్టుబడి పెట్టి, ప్రతి నెలా కాస్త మొత్తాన్ని పొందవచ్చు. ఆ పథకమే ‘పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (POMIS)’. ఇది కేంద్ర ప్రభుత్వం ద్వారా నిర్వహించబడుతున్నందున ఇందులో పెట్టుబడి సురక్షితంగా ఉంటుంది. ఈ పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ అనేది.. ఒకసారి డబ్బు జమ చేస్తే, ప్రతి నెలా వడ్డీ రూపంలో నిర్ణీత మొత్తాన్ని అందిస్తుంది. ఈ ఖాతాను ఎవరైనా ఒంటరిగా (సింగిల్) లేదా భార్యాభర్తలిద్దరూ కలిసి (జాయింట్) తెరవవచ్చు.
Maoists Surrender: నిన్న మల్లోజుల, నేడు ఆశన్న.. అడవి బాట వీడి జనజీవన స్రవంతిలోకి మావోయిస్టులు!
ఈ పథకంలో రూ.1,000 తోనే ఖాతా తెరవవచ్చు. సింగిల్ అకౌంట్‌లో గరిష్టంగా రూ.9 లక్షల వరకు, జాయింట్ అకౌంట్‌లో గరిష్టంగా రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ముఖ్యంగా వివాహిత జంటలకు, భవిష్యత్తు ప్రణాళికల కోసం జాయింట్ అకౌంట్ చాలా మంచి ఎంపికగా నిలుస్తుంది. ప్రస్తుతం ఈ పథకంపై సంవత్సరానికి 7.4% చొప్పున వడ్డీ లభిస్తుంది. ఈ వడ్డీ ప్రతి నెలా మీ ఆదాయంగా మీ ఖాతాలో జమ అవుతుంది. దీని మెచ్యూరిటీ పీరియడ్ 5 సంవత్సరాలుగా ఉంటుంది. అయితే మీరు కొత్త వడ్డీ రేటుతో ఈ పథకాన్ని పొడిగించుకునే అవకాశం కూడా ఉంది. దీని ద్వారా మీ ఆదాయం సుదీర్ఘ కాలం పాటు కొనసాగుతుంది.
3Years Boy: థర్డ్ ఫ్లోర్ నుంచి గాలి పటం అందుకోబోతూ..
ఉదాహరణకు మీరు జాయింట్ అకౌంట్‌లో రూ.15 లక్షలు జమ చేస్తే, మీకు ప్రతి నెలా దాదాపు రూ.9,250 లభిస్తాయి. అదేవిధంగా సింగిల్ అకౌంట్‌లో రూ.9 లక్షలు జమ చేస్తే, ప్రతి నెలా సుమారు రూ.5,550 ఆదాయం లభిస్తుంది. ఇది స్థిరమైన, రిస్క్ లేని ఆదాయ వనరుగా పనిచేస్తుంది. మీ పిల్లలు 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు కలిగి ఉంటే వారి పేరు మీద కూడా మీరు మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌లో ఖాతా తెరవవచ్చు. ఇది పిల్లల ఫీజులు లేదా ఇతర ఖర్చుల కోసం ప్రతి నెలా స్థిరమైన డబ్బును అందించి కుటుంబానికి మంచి ఆర్థిక సహాయంగా నిలుస్తుంది.
