Best Postal Scheme: బెస్ట్ పోస్టాఫీస్ స్కీమ్.. రూ.2 లక్షలకు రూ. 4 లక్షల లాభం..

పోస్ట్ ఆఫీసు అందించే చిన్న మొత్తాల పొదుపు పథకాలలో కిసాన్ వికాస్ పత్ర (KVP) ఎంతో ప్రజాదరణ పొందింది. ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని నిర్దిష్ట కాలంలో రెట్టింపు చేయడం. ప్రస్తుతం ఈ పథకంపై వార్షిక వడ్డీ రేటు 7.5 శాతంగా అమలవుతోంది.

ఉదాహరణకు ఎవరైనా రూ. 2 లక్షలు పెట్టుబడి పెడితే, ప్రస్తుత నిబంధనల ప్రకారం 115 నెలలు అనగా 9 సంవత్సరాల 7 నెలల కాలంలో ఆ మొత్తం పూర్తిగా రూ. 4 లక్షలుగా మారుతుంది. ఈ పథకం పేరులో ‘కిసాన్’ అని ఉన్నప్పటికీ, ఇది కేవలం రైతులకు మాత్రమే పరిమితం కాదు. దేశంలోని అర్హులైన ప్రతి పౌరుడు ఇందులో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది.

కేవలం రూ. 1,000 తో ఖాతా ప్రారంభించవచ్చు. గరిష్ట పెట్టుబడికి ఎలాంటి పరిమితి లేదు. ఒక్క వ్యక్తి తన పేరుతో లేదా మైనర్ పిల్లల తరఫున దీనిని తీసుకోవచ్చు. అలాగే ముగ్గురు వ్యక్తులు కలిసి సంయుక్తంగా జాయింట్ ఖాతాను కూడా తెరవవచ్చు. షేర్ మార్కెట్ వంటి రిస్కులు ఏమాత్రం లేని సురక్షితమైన పెట్టుబడి కోరుకునే వారికి ఇది మంచి ఎంపిక.

ఇందులో వడ్డీ విడిగా చెల్లించబడదు, బదులుగా మెచ్యూరిటీ సమయంలో అసలుతో పాటు మొత్తం డబ్బు కలిసి చేతికి అందుతుంది. అత్యవసర పరిస్థితులు ఎదురైతే సాధారణంగా 2 సంవత్సరాల 6 నెలల తర్వాత డబ్బును ముందుగానే వెనక్కి తీసుకునే సదువుల కల్పిస్తారు. అయితే పూర్తి కాలపరిమితి ముగిసే వరకు ఉంచితేనే గరిష్ట ప్రయోజనం పొందవచ్చు. ప్రభుత్వం ఎప్పుడైనా వడ్డీ రేట్లలో మార్పులు చేసే అవకాశం ఉన్నందున, ఖాతా ప్రారంభించే సమయంలో వర్తించే నిబంధనలను ఒకసారి పరిశీలించడం మంచిది. దీర్ఘకాలిక భద్రత, ఖచ్చితమైన రాబడి ఆశించే మధ్యతరగతి పెట్టుబడిదారులకు ఇది చక్కటి ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది.