NTV Telugu Site icon

Post office franchise: రూ.5000వేలతో పోస్టాఫీసు ఫ్రాంచైజీని తీసుకోండి.. నెలకు లక్ష సంపాదించండి

Post Office Scheme

Post Office Scheme

Post office franchise: భారతీయ పోస్ట్ నెట్‌వర్క్ దేశవ్యాప్తంగా విస్తరించి ఉంది. ఒక నివేదిక ప్రకారం.. భారతదేశంలో 1.56 లక్షలకు పైగా పోస్టాఫీసులు ఉన్నాయి. ఇంత పెద్ద సంఖ్యలో పోస్టాఫీసులు ఉన్న తర్వాత కూడా చాలా ప్రాంతాల్లో పోస్టాఫీసుల కొరత ఉండడం గమనార్హం. ఇలాంటి పరిస్థితుల్లో ఆయా ప్రాంతాల్లో నివసించే ప్రజలు పోస్టాఫీసుకు సంబంధించిన సౌకర్యాలు పొందేందుకు వేరే ప్రాంతానికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని పోస్టల్ శాఖ ఫ్రాంఛైజీ పథకాన్ని తీసుకొచ్చింది. అటువంటి పరిస్థితిలో రూ. 5 వేలతో పోస్టాఫీసు ఫ్రాంచైజీ పథకాన్ని దక్కించుకోవచ్చు.

ఈ పథకం కింద రెండు రకాల ఫ్రాంచైజ్ స్కీమ్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఫ్రాంఛైజీ అవుట్‌లెట్‌ను ప్రారంభించడం మొదటి ఎంపిక.. పోస్ట్ ఏజెంట్‌గా మారడం రెండవ ఎంపిక. దాని గురించి వివరంగా తెలుసుకుందాం.. పోస్ట్ ఆఫీస్ సంబంధిత సేవలకు చాలా డిమాండ్ ఉన్న కొన్ని ప్రదేశాలలో పోస్టాఫీసు తెరవడం సాధ్యం కాదు. అటువంటి పరిస్థితిలో ఫ్రాంచైజీ సహాయంతో ఈ ప్రదేశాలలో అవుట్‌లెట్ తెరవవచ్చు.

Read Also:AAP: ఆర్డినెన్సుకు వ్యతిరేకంగా ఆప్‌ ర్యాలీ.. ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం

పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజీని 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న భారతీయ పౌరులు ఎవరైనా తీసుకోవచ్చు. అయితే, పోస్టాఫీసు ఫ్రాంచైజీని తీసుకోవడానికి, మీరు రూ. 5,000 సెక్యూరిటీ డబ్బును డిపాజిట్ చేయాలి. పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజీ నుండి సంపాదించడానికి స్థిరమైన ప్రమాణాలు లేవు. మీ పని ఎలా ఉంటుందో, మీ సంపాదన కూడా అదే విధంగా ఉంటుంది. విశేషమేమిటంటే, మీ ప్రాంతంలో పోస్టాఫీసు లేకుంటే.. పోస్టాఫీసు సంబంధిత సేవలకు చాలా డిమాండ్ ఉంటే పోస్టాఫీసు ఫ్రాంచైజీ మీకు లాభాలను తెచ్చి పెడుతుంది. మీరు పోస్టాఫీసు ఫ్రాంచైజీ సహాయంతో లక్షల రూపాయలు సంపాదించవచ్చు. ఇండియన్ పోస్ట్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా ఆన్‌లైన్‌లో పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టాఫీసు ఫ్రాంచైజీ తీసుకునేందుకు అర్హతలు..
* ఫ్రాంచైజీ ప్రారంభించాలకుంటే.. వారి వయసు 18 ఏళ్లకు పైబడి ఉండాలి.
* భారతీయ పౌరుడైన ఏ వ్యక్తైనా ఈ ఫ్రాంచైజీ తీసుకోవచ్చు.
* ప్రభుత్వ గుర్తింపు పొందిన స్కూల్ నుంచి ఎనిమిదవ తరగతి పాస్ అయి ఉండాలి.
* పోస్టల్ ఉద్యోగులకు చెందిన కుటుంబ సభ్యులకు ఈ ఫ్రాంచైజీలను ఇవ్వరు.

ఫ్రాంచైజీ స్కీమ్ వల్ల కలిగే లాభాలు..
* పోస్టాఫీసు సర్వీసులు అందిస్తూ.. మంచి కమీషన్ పొందవచ్చు.
* రిజిస్టర్డ్ పోస్టు బుకింగ్‌ ఒక్కో లావాదేవీకి రూ.3 కమీషన్ తీసుకోవచ్చు.
* స్పీడ్ పోస్టు బుకింగ్కు ఒక్కో లావాదేవీకి రూ.5
* రూ.100 నుంచి రూ.200 మధ్యలో మనీ ఆర్డర్లకు రూ.3.50 కమీషన్, రూ.200 పైన మనీ ఆర్డర్లకు రూ.5 కమీషన్ తీసుకోవచ్చు
* రూ.100 కంటే తక్కువ మనీ ఆర్డర్లను బుక్ చేయడానికి వీలు లేదు.
* నెలవారీ టార్గెట్ కింద 1000 రిజిస్టర్డ్, స్పీడ్ పోస్టు బుకింగ్స్ చేపడితే.. అదనంగా 20 శాతం కమీషన్
* పోస్టల్ స్టాంపులు, స్టేషనరీ విక్రయిస్తే వాటిపై 5 శాతం కమీషన్ పొందవచ్చు
* రెవెన్యూ, సెంట్రల్ రిక్రూట్‌మెంట్ ఫీజు స్టాంపులు వంటి రిటైల్ సర్వీసుల అమ్మకం ద్వారా పోస్టల్ డిపార్ట్‌మెంట్ నుంచి ఆర్జించే ఆదాయాలపై 40 శాతం కమీషన్‌ను పొందవచ్చు.
* రిజిస్టర్డ్ పార్సిల్ నుంచి నెలవారీ వ్యాపారాలకు, స్పీడ్ పోస్ట్ పార్సిల్స్‌కి కమీషన్లు వేరుగా ఉంటాయి.
* ఇలా పోస్టాఫీసు ఫ్రాంచైజీ స్కీమ్ నుంచి పలు రకాల లాభాల ద్వారా నెలకు భారీగా సంపాదించవచ్చు.

Read Also:Amit Shah: అమిత్ షా తమిళనాడు పర్యటన.. రాష్ట్రంలో పవర్ కట్

Show comments