సాధారణంగా ఒక ఇంట్లో డెలివరీ అయిందంటే చాలు.. అందరి అటెన్షన్ మొత్తం ఆ చిన్నారి పైనే ఉంటుంది. శిశువు క్షేమం గురించి ఆలోచించే క్రమంలో కన్నతల్లి ఆరోగ్యాన్ని అందరూ విస్మరిస్తుంటారు. డెలివరీ అయిన మొదటి రోజు నుంచే ఒక తల్లి తన నిద్రను పూర్తిగా త్యాగం చేస్తుంది. పసి పాప ఏడుపు, పాలు పట్టడం, వారి ఆలనా పాలనా చూసుకోవడంలో ఆమెకు విశ్రాంతి అన్నది కరువవుతుంది. తన డైట్ విషయంలో కూడా ఎన్నో కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. చివరికి తన పై తనకున్న ప్రేమను (Self Love) కూడా పక్కన పెట్టి, సర్వస్వం బిడ్డ కోసమే అన్నట్లుగా మారిపోతుంది. అయితే..
మెడికల్ పరంగా చూస్తే, డెలివరీ తర్వాత ఒక మహిళ శరీరం మళ్ళీ సాధారణ స్థితికి రావడానికి కనీసం రెండు ఏళ్ల సమయం పడుతుందట. ఆ గ్యాప్ లో ఆమె మానసికంగా, శారీరకంగా కోలుకోవాల్సి ఉంటుంది. కానీ చాలా కుటుంబాల్లో మొదటి డెలివరీ అయిన ఏడాది లోపే రెండో ప్రెగ్నెన్సీ రావడం చూస్తుంటాం. ఆ సమయంలో తెలియదు కానీ, 35 ఏళ్లు దాటిన తర్వాతే అసలు సమస్యలు మొదలవుతాయి. వరుస ప్రెగ్నెన్సీల వల్ల వెన్నునొప్పి (Back Pain), మోకాళ్ళ నొప్పులు (Knee Pain) వంటి దీర్ఘకాలిక సమస్యలు మహిళలను వేధిస్తాయి.
అందుకే ప్రెగ్నెన్సీ సమయంలోనే కాదు, డెలివరీ తర్వాత కూడా భర్తలు తమ భార్యల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆమెకు కావాల్సిన మానసిక ధైర్యాన్ని, విశ్రాంతిని అందించడం భర్తగా కనీస బాధ్యత తీసుకోవాలి. బిడ్డ పట్ల తను కూడా భాద్యతగా ఉండాలి. రాత్రిలు తన భార్యతో పాటు తను కూడా నిద్ర లేచి కాసేపు పిలాడిని ఎతుకోవడం చేస్తుండాలి. ఎందుకంటే భార్య ఆరోగ్యం బాగుంటేనే, ఆ కుటుంబం మొత్తం ఆరోగ్యంగా ఉంటుందని గుర్తించాలి. అలాగే తదుపరి ప్రెగ్నెన్సీకి ఆమె శరీరం సిద్ధంగా ఉందో లేదో గమనించి, తగిన సమయం ఇవ్వడం చాలా ముఖ్యం. సో.. తండ్రిగా మారిన ప్రతి భర్త ఈ విషయాలను గుర్తుంచుకుంటేనే ఆ ఇంటి ఇల్లాలు సంతోషంగా ఉంటుంది.
