NTV Telugu Site icon

Hyderabad: జీహెచ్ఎంసీ యాప్ ద్వారా క్యూ లైన్ వివరాలు తెలుసుకునే అవకాశం

Polling

Polling

హైదరాబాద్ జిల్లాలో మొట్ట మొదటి సారిగా పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటు వేసే క్యూ లైన్ వివరాలు తెలుసుకునేందుకు జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ వినూత్న చర్యలు చేపట్టారు. జిల్లాలో ప్రతి ఒక్కరూ ఓటు వేయాలనే ఉద్దేశ్యంతో పోలింగ్ కేంద్రాల దగ్గర క్యూ లైన్ తెలుసుకునేందుకు పోల్ క్యూ రూట్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చును.. జీహెచ్ఎంసీ వెబ్ సైట్.. మై జీహెచ్ఎంసీ యాప్ లలో poll Q route యాప్ ను ఆక్టివేట్ చేశారు. అయితే, ముందుగా జీహెచ్ఏంసీ వెబ్ సైట్ లో వెళ్ళిన తర్వాత పోల్ క్యూ లైన్ నీ సెలెక్ట్ చేసుకోవాలి.. ఆ తర్వాత నియోజక వర్గం పేరు పోలింగ్ స్టేషన్ పేరు నమోదు చేసిన తర్వాత పోలింగ్ కేంద్రం ఎక్కడ ఉందో నేవియేషన్ చూపిస్తుంది..

Read Also: Amardeep: అడుక్కోవడం.. అలగడం తప్ప.. ఏమైనా చేస్తున్నావా బ్రో.. ?

అయితే, ఎంత మంది క్యూ లైన్ లో వేచి ఉన్నారో చూపిస్తుంది.. వెయిటింగ్ టైం కూడా చూపిస్తుంది.. ఈ క్యూ లైన్ సెక్టిర్ ఆఫీసర్ అప్ డేట్ చేస్తారు అని రోనాల్డ్ రోస్ తెలిపారు. ఈ యాప్ లో నియోజకవర్గం పేరు, పోలింగ్ స్టేషన్ పేరు నమోదు చేస్తే వివరాలు క్యూ పరిస్థితి తెలుసుకోవచ్చని జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ తెలిపారు. ఓటు హక్కు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలనే ఉద్దేశ్యంతో ఈ యాప్ ను రూపొందించారు.. ఓటరు జాబితాలో పేరు ఉన్న ప్రతి ఒక్కరు పోలింగ్ రోజున ఓటు వేయాలని రోనాల్డ్ రోస్ కోరారు.