Site icon NTV Telugu

Portronics Projector Launch: కేవలం 10 వేలతో.. మీ ఇంటిని బెస్ట్ థియేటర్‌గా మార్చేయొచ్చు!

Portronics Beam 550 Projector

Portronics Beam 550 Projector

ప్రస్తుతం ప్రపంచమంతా ‘ఓటీటీ’ల హవా నడుస్తోంది. నెల తిరక్కముందే ఓటీటీలోకి రావడం, చాలా తక్కువ ధరకే ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ అందుబాటులో ఉండడంతో.. చాలా మంది థియేటర్‌కు వెళ్లి సినిమాలు చూడడం లేదు. హాయిగా ఇంట్లోనే కూర్చుని కుటుంబ సమేతంగా సినిమాలను ఎంజాయ్ చేస్తున్నారు. ఓటీటీల పుణ్యమాని బిగ్ స్క్రీన్‌ స్మార్ట్ టీవీలతో పాటుగా ఎల్ఈడీ ప్రొజెక్టర్‌లకు డిమాండ్ భారీగా పెరిగింది. ఇది దృష్టిలో పెట్టుకుని కంపనీలు కూడా ఎల్ఈడీ ప్రొజెక్టర్‌లను లాంచ్ చేస్తున్నాయి. ‘పోర్ట్రోనిక్స్’ తాజాగా ఓ మినీ ప్రొజెక్టర్‌ను విడుదల చేసింది.

పోర్ట్రోనిక్స్ కంపెనీ బీమ్ 550 స్మార్ట్ ఎల్ఈడీ ప్రొజెక్టర్ విడుదల చేయబడింది. ఈ ఆండ్రాయిడ్ టీవీ-ఎనేబుల్డ్ ప్రొజెక్టర్‌తో 100-అంగుళాల స్మార్ట్ టీవీని సృష్టించవచ్చు. ఈ ప్రొజెక్టర్ ఆటోఫోకస్‌ను కలిగి ఉంది. ఆటో-కీనోట్ కరెక్షన్‌ కూడా ఉంది. ఎత్తును సర్దుబాటు చేసే టెలిస్కోపిక్ మోనోప్యాడ్ స్టాండ్‌తో కూడా ఇది వస్తుంది. దీనిని టేబుల్, గోడ లేదా పైకప్పుపై అమర్చవచ్చు. బీమ్ 550 మినీ ప్రొజెక్టర్ ఆండ్రాయిడ్ టీవీ ద్వారా రన్ అవుతుంది. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్, యూట్యూబ్‌తో సహా అనేక యాప్‌లలు ఇన్‌స్టాల్ అయి వస్తాయి. అదనపు యాప్‌లను ప్లే స్టోర్ ద్వారా కూడా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. స్క్రీన్‌ మిర్రరింగ్ ఫీచర్‌ సాయంతో స్మార్ట్ ఫోన్‌, ల్యాప్‌టాప్‌లో కూడా కంటెంట్‌ను వీక్షించవచ్చు.

Also Read: iPhone 17 Pro Price Drop: అమెజాన్‌లో దిమ్మతిరిగే ఆఫర్.. 70 వేలకే ఐఫోన్ 17 ప్రో!

పోర్ట్రోనిక్స్ బీమ్ 550 ప్రొజెక్టర్ డ్యూయల్-బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, HDMI, USB, AUX లాంటి కనెక్టివిటీలను కలిగి ఉంటుంది. దీనికి అంతర్నిర్మిత 5W సౌండ్ బాక్స్ ఉంది. ఈ ప్రొజెక్టర్ 1GB RAM, 8GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ఈ ప్రొజెక్టర్ ప్రారంభ ధర రూ.9,999గా ఉంది. టాప్ వెర్షన్ రూ.19,999గా కంపెనీ పేర్కొంది. ఈ ప్రొజెక్టర్‌ను పోర్ట్రోనిక్స్ అధికారిక పోర్టల్, అమెజాన్ ఇండియా సహా ఫ్లిప్‌కార్ట్ నుంచి కొనుగోలు చేయవచ్చు. తక్కువ ధరలో అందుబాటులో ఉన్న ప్రొజెక్టర్లలో ఇది ఒకటి. ఈ ప్రొజెక్టర్‌ కేవలం 1.2 కిలోల బరువు మాత్రమే ఉంటుంది కాబట్టి.. ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లొచ్చు.

Exit mobile version