Poonch Encounter: జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాలు సంయుక్తంగా జరిపిన ఆపరేషన్‌లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఎన్‌కౌంటర్ పూంచ్ జిల్లాలోని సింధారా ప్రాంతంలోని సురాన్‌కోట్ అనే ప్రదేశంలో జరిగింది. సోమవారం అర్ధరాత్రి ఉగ్రవాదులతో భద్రతా బలగాలు రెండుసార్లు ఎదురుకాల్పులు జరిపాయి. రెండోసారి జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా బలగాలు నలుగురు ఉగ్రవాదులను హతమార్చాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.
Read Also:Journalists Mahadharna: నేడు ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌లో జర్నలిస్టులు మహాధర్నా
ఎన్‌కౌంటర్ గురించి భారత ఆర్మీ అధికారులను ఉటంకిస్తూ జాతీయ మీడియా సమాచారం వెల్లడించింది. వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో సురన్‌కోట్ ప్రాంతంలో ఉగ్రవాదులు భద్రతా బలగాలపై మొదట దాడి చేశారు. దీని తరువాత భారత సైన్యం ప్రత్యేక దళాలు, రాష్ట్రీయ రైఫిల్స్, జమ్మూ కాశ్మీర్ పోలీసు సిబ్బంది సంయుక్త బృందం ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. మొదటి ఎన్‌కౌంటర్ తర్వాత ఉమ్మడి బృందం రాత్రి నిఘా పరికరాలతో కూడిన డ్రోన్‌ల సహాయంతో ఆ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం వెతకడం ప్రారంభించింది. మంగళవారం తెల్లవారుజామున ఉగ్రవాదుల దాక్కున్న చోటు గురించి సంయుక్త బృందానికి సమాచారం అందింది. ఉగ్రవాదులను పట్టుకునేందుకు చేరుకున్న జాయింట్ టీమ్‌పై కాల్పులు జరిగాయి. ప్రతీకార కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.
Read Also:Chandigarh Case: మైనర్ పై అత్యాచారం చేసిన 45 ఏళ్ల వ్యక్తికి 20ఏళ్ల జైలు శిక్ష వేసిన కోర్టు
హతమైన నలుగురు ఉగ్రవాదులు విదేశీయులని ఆర్మీ అధికారులు తెలిపారు. అయితే స్థానిక స్థాయిలోనూ వారిని గుర్తించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్న వారి ఆచూకీ కూడా ఆరా తీస్తున్నారు. ఈ కేసులో చాలా మందిని త్వరలో అరెస్టు చేసే అవకాశం ఉంది.