NTV Telugu Site icon

Poonam Pandey Death: పూనమ్ పాండే మృతి?.. ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్!

Poonam Pandey Death News

Poonam Pandey Death News

Poonam Pandey Dead: బాలీవుడ్ వివాదాస్పద నటి పూనమ్ పాండే మరణించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. గర్భాశయ క్యాన్సర్‌తో పూనమ్ మృతి చెందిందని పూనమ్ పాండే రియల్ (poonampandeyreal) అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది. విషయం తెలిసిన ఫాన్స్ షాక్ అవుతున్నారు. పూనమ్ వయసు ప్రస్తుతం 32 ఏళ్లు.

‘ఈ ఉదయం మాకు చాలా కఠినమైనది. గర్భాశయ క్యాన్సర్‌తో పూనమ్ పాండే మరణించారని తెలియజేయడానికి చాలా బాధపడుతున్నాను. ఈ దుఃఖ సమయంలో ఆమెను గుర్తుచేసుకోవాల్సి ఉంది’ అని ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పేర్కొన్నారు. పూనమ్ ఉత్తరప్రదేశ్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు ఓ జాతీయ మీడియా జర్నలిస్ట్ తెలిపారు. పూనమ్ మరణ వార్తను ఆమె పీఆర్ బృందం ధృవీకరించిందని, త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల చేస్తారని చెప్పారు.

మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించిన పూనమ్‌ పాండే.. 2013లో ‘నాషా’తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. సినిమాల కంటే ఆమె వివాదాస్పద వ్యాఖ్యలతోనే ఎక్కువగా పబ్లిసిటీ పొందుతూ వచ్చారు. అప్పట్లో భారత్ వన్డే ప్రపంచకప్ గెలిస్తే నగ్నంగా స్టేడియంలోకి వస్తానని ప్రకటించిన పూనమ్ బాగా ఫేమస్ అయ్యారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

Show comments