NTV Telugu Site icon

NBK 109 : బాలయ్య ఫ్యాన్స్ కు పూనకాలే.. స్టన్నింగ్ అప్డేట్ వచ్చేస్తుంది..

Nbk109

Nbk109

NBK 109 : నందమూరి నట సింహం బాలయ్య గత ఏడాది “భగవంత్ కేసరి” సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా భారీగా కలెక్షన్స్ రాబట్టింది.ప్రస్తుతం బాలయ్య యంగ్ డైరెక్టర్ బాబీ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.”NBK109″ అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ బ్యానర్స్ పై నాగవంశీ, సౌజన్య ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ఈ సినిమాను దర్శకుడు బాబీ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాకి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

Read Also :Kalki 2898 AD : ‘కల్కి’ ట్రైలర్ రిలీజ్ పై బిగ్ అప్డేట్ వైరల్..

ఈ సినిమా నుండి మేకర్స్ ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్సె వీడియో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.బాలయ్య మాస్ డైలాగ్స్ ఫ్యాన్స్ కు విపరీతంగా నచ్చేసాయి.జూన్ 10 బాలయ్య బర్త్ డే సందర్భంగా మేకర్స్ భారీ అప్డేట్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది.రీసెంట్ గా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఫైరింగ్ అప్డేట్ రానుందని ట్వీట్ చేయగా దర్శకుడు బాబీ కూడా అదే తరహాలో ట్వీట్ చేసారు.అయితే బాలయ్య బర్త్ డే కు చిత్ర యూనిట్ ఈ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ చేయనున్నట్లు సమాచారం.అలాగే బాలయ్య తరువాత నటిస్తున్న అఖండ 2 నుంచి కూడా సాలిడ్ అప్డేట్ రానుండటంతో బాలయ్య ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.