బుట్ట బొమ్మ పూజా హెగ్డే పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఒకవైపు ప్లాప్ సినిమాలు పలకరిస్తున్న కూడా మరోవైపు వరుస సినిమాలు చేస్తుంది.. ఇక సోషల్ మీడియాలో ఏ రేంజులో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. తాజాగా మరోసారి అందాలతో రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది.. తన బోల్డ్ పోజులతో నిద్ర లేకుండా చేస్తుంది. తాజాగా ఆమె షేర్ చేసిన గ్లామరస్ లుక్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తుంది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
వరుస విజయాలతో దూసుకు వెళుతున్న అమ్మడు చతికిల పడింది. పూజా హెగ్డేకు ఇది ఊహించని పరిస్థితి. టాప్ హీరోల ఫస్ట్ ఛాయిస్ కాస్త ఆఫర్స్ లేక ఖాళీగా ఉంది.. అఖిల్ సినిమా వరకు బాగానే ఉన్న అమ్మడు పరిస్థితి ఇప్పుడు అంత బాగోలేదనే చెప్పాలి.. ఈ ఏడాదిలో రిలీజ్ అయిన సినిమాలు పూజ నటించిన రాధే శ్యామ్, ఆచార్య, బీస్ట్, సర్కస్, కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ చిత్రాలు డిజాస్టర్ అయ్యాయి. ఎఫ్ 3 చిత్రంలో పూజ హెగ్డే ఐటెం సాంగ్ చేసింది. ఆ చిత్రం కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు.. దాంతో అమ్మడుకు బ్యాడ్ టైం నడుస్తుంది..
విజయ్ దేవరకొండతో స్టార్ట్ చేసిన జనగణమన మధ్యలో ఆగిపోయింది. లైగర్ రిజల్ట్ దెబ్బకు జనగణమన నిర్మాతలు ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు. ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేసుకున్న జనగణమన అటకెక్కింది. దాదాపు రూ. 5 కోట్ల పారితోషికం చేజారింది.. ప్రస్తుతం పూజా చేతిలో ఒక్క మూవీ లేదు. సాయి ధరమ్ తేజ్ హీరోగా సంపత్ నంది తెరకెక్కిస్తున్న గంజా శంకర్ మూవీలో పూజ హెగ్డే హీరోయిన్ అనే ప్రచారం జరుగుతుంది. అధికారికంగా ప్రకటించలేదు. పూజ హెగ్డే ఖాళీగానే ఉన్నారని సమాచారం.. ఈ సమయాన్ని క్యాష్ చేసుకోవడం కోసం బోల్డ్ ఫోటో షూట్ చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి..
