NTV Telugu Site icon

Pooja Ramachandran : స్విమ్ షూట్ లో తడి అందాలతో హాట్ ట్రీట్..తల్లైనా తగ్గట్లేదుగా..

Pooja Ramachandran

Pooja Ramachandran

స్వామిరారా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనా ముద్దుగుమ్మ పూజా రామచంద్రన్‌.. ఈ అమ్మడు పలు సినిమాల్లో నటించింది.. చేసింది కొన్ని సినిమాలే అయిన ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే.. ఇక ఆ తరువాత బిగ్ బాస్ షోలో కనిపించింది. కానీ బిగ్ బాస్ ఇంట్లో ఎక్కువ రోజులు ఉండలేకపోయింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన పూజను జనాలు వెంటనే బయటకు పంపించేశారు. అప్పుడు కౌశల్ ఆర్మీ దెబ్బకు బలైన వారిలో పూజా రామచంద్రన్ కూడా ఒకరు. అలా బిగ్ బాస్ ఇంట్లో షార్ట్ జర్నీ అయినా కూడా తన మార్క్ వేసింది పూజా.. ఈ షో తర్వాత అమ్మడుకు పెద్దగా కలిసి రాలేదు..

అయితే,సినిమా ఆఫర్లు కూడా ఎక్కువగా రాలేదు. కాకపోతే సోషల్ మీడియాలో మాత్రం పూజ పేరు బాగానే మార్మోగిపోయింది. ఇక తన భర్త జాన్ కొక్కెన్‌తో కలిసి పూజ చేసే ఫోటో షూట్లు అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. ఈ భార్యాభర్తలిద్దరూ పొట్టి పొట్టి డ్రెస్సుల్లో కనిపిస్తూ నెట్టింట ఓ రేంజులో రచ్చ చేస్తూ వచ్చారు.. ఆ ఫోటోలు నెట్టింట వైరల్ కావడంతో రకరకాల కామెంట్స్ ని అందుకున్నాయి.. అలా జనాలకు దగ్గరైంది పూజా.. ఇక ఈ మధ్య ఈ అమ్మడు తళ్ళైన సంగతి తెలిసిందే.. అయితే పూజా బిడ్డ పుట్టాక కాస్త బొద్దుగా మారింది.. ఆ ఒళ్ళును తగ్గించుకొనేందుకు ప్రయత్నాలు చేస్తుంది..

తాజాగా పూజా రామచంద్రన్ స్విమ్ సూట్‌లో కనిపించింది. అయితే పూజ కాస్త లావుగా మారింది. మొహం కూడా గుర్తు పట్టనంతగా మారిపోయింది. ఈ మార్పుల గురించి పూజ చెబుతూ.. మన శరీరం ఎలాంటి మార్పులనైనా తట్టుకుంటుంది.. కానీ వాటి కోసం మన మైండ్‌ను సిద్దంగా ఉంచాలి అన్నట్టుగా చెప్పుకొచ్చింది.. నా శరీరాన్ని నేను మునుపటి లాగా మార్చుకొనే ప్రయత్నం చేస్తున్నాను..నా జీవితాన్ని నేను ప్రేమిస్తున్నాను.. ఆరోగ్యమే మహా భాగ్యం ఇలా రకరకాల హ్యాష్ ట్యాగ్‌లతో పూజ రామచంద్రన్ షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇక పూజ భర్త జాన్ కొక్కెన్‌కు ఈ మధ్య మంచి అవకాశాలు వస్తున్నాయి. తమిళ, తెలుగు పరిశ్రమల్లో బిజీ నటుడిగా మారిపోయాడు… ఇక పూజా జోరు చూస్తుంటే మళ్లీ సినిమాల్లో నటించడానికి రెడీ అవుతుందని తెలుస్తుంది..

Show comments