Site icon NTV Telugu

Pooja Hegde : నా క్యారవాన్ లోకి దూరి నాపై చేయి వేసిన పాన్ ఇండియా హీరోను చెంపదెబ్బ కొట్టాను

Pooja Hegde

Pooja Hegde

సినీ పరిశ్రమలో గ్లామర్ వెనుక ఎన్నో అవమానకర అనుభవాలు, ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ముఖానికి రంగు వేసుకున్నంత మాత్రాన చులకనగా చూస్తారని ఎన్నో సార్లు ఎందరో నటీనటులు తమకు ఎదురైనా ఇబ్బందికర సంఘనల గురించి చెప్తుంటారు. మరి ముఖ్యంగా హీరోయిన్స్ పట్ల కొందరు దురుసుగా ప్రవర్తిస్తుంటారు. తాజాగా టాలీవుడ్ నటి పూజా హెగ్డే తన కెరీర్‌లో ఎదురైన ఓ షాకింగ్ ఘటనను గురించి వెల్లడించింది.

Also Read : Dhurandhar Movie : ధురంధర్ లో విలన్ రోల్ కు నో చెప్పిన టాలీవుడ్ స్టార్ హీరో

వివరాలలోకెళితే పూజా హెగ్డే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘కొన్ని సంవత్సరాల క్రితం తాను ఓ భారీ పాన్ ఇండియా సినిమాలో నటించాను. ఆ సినిమా షూటింగ్ సమయంలో తన అనుమతి లేకుండా కనీసం మాట కూడా అడగకుండా  ఓ స్టార్ నటుడు తన కారవాన్‌లోకి ప్రవేశించాడు. ఆ క్షణంలో తాను చాలా ఇబ్బంది పడ్డాను. ఆ నటుడు నాతో హద్దులు దాటినట్లుగా అనిపించింది. అప్పుడు ఏమి చేయాలో అర్ధం కాలేదు. ఇక ఆ పరిస్థితిలో తాను మౌనంగా ఉండలేక వెంటనే అతడిని చెంపదెబ్బ కొట్టాను. దాంతో అతను వ్యాన్ దిగి వెళ్ళాడు. ఆ ఘటన తర్వాత ఆ నటుడు మళ్లీ తనతో కలిసి పని చేయడానికి ఇష్టపడలేదు. చివరకు ఆ పాన్ ఇండియా సినిమాలో నాకు సంబంధించిన కొన్ని సీన్స్ లో నేను నటించాల్సి ఉండగా డూప్ ను పెట్టి తీసేసారు’ అని తెలిపింది పూజా. అయితే ఆ వ్యక్తి ఎవరో మాత్రం ఆమె వెల్లడించలేదు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లోనూ, సోషల్ మీడియాలోనూ చర్చనీయాంశంగా మారాయి.  ఇంతకీ ఎవరా స్టార్ హీరో అని ట్వీట్స్ చేస్తున్నారు.

Exit mobile version