NTV Telugu Site icon

Pooja Hegde : జిమ్‌లో పూజా హెగ్డే భారీ వర్కౌట్స్ చూస్తే మైండ్‌ బ్లాకే..

Poojahegde

Poojahegde

పూజా హెగ్డే గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. బుట్టబొమ్మగా బాగా ఫెమస్ అయ్యింది.. స్లిమ్‌గా, ఫిట్‌గా ఉంటుంది. ఎప్పుడూ సేమ్‌ లుక్‌ని మెయింటేన్‌ చేస్తుంటుంది. అంతే అందంగా, హాట్‌గానూ ఉంటుంది.. ఆ లుక్ ను అలా మెయింటైన్ చెయ్యడం కోసం పూజా ఎప్పుడూ జిమ్ లో కష్టపడుతూ ఉంటుంది.. భారీ కసరత్తులు చేస్తూ ఉంటుంది..తాజాగా జిమ్‌లో శ్రమిస్తున్న వీడియోని పంచుకుంది. ఇందులో ఆమె కఠినమైన వర్కౌట్స్ చేస్తుంది. బాక్సింగ్‌ బ్యాగ్‌లపై నుంచి కిందకి పైకి పుషప్స్ చేసింది. ఆగకుండా ఆమె ఏడు సార్లు చేసింది. తన స్టామినా ఏంటో నిరూపించింది..ఆ వర్కౌట్స్ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి..

పూజా హెగ్డే నడుము ఇంత స్లిమ్‌గా ఉండటానికి కారణం ఇప్పుడు అర్థమైంది. ఆమె అందుకోసం ఎంత కష్టపడుతుందో ఈ వర్కౌట్స్ వీడియో ద్వారా తెలుస్తుంది. టైట్‌ ఫిట్‌లో థైస్‌ అందాలతో పూజా ఆకట్టుకుంటుంది. అదే సమయంలో మేకప్‌ లేకుండా కూడా పూజా చాలా క్యూట్ గా ఆకట్టుకుంటుంది.. పూజా హెగ్డే ఈ జిమ్‌ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ ఫైరింగ్‌ ఎమోజీలను షేర్‌ చేస్తుంది. సెలబ్రిటీలు సైతం కామెంట్లు చేస్తుండటం విశేషం.. ఈ ఫోటోలను చూసిన వారంతా కూడా వావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు..

ఒకవైపు ప్లాపులు పలకరిస్తున్నా కూడా సినిమా ఆఫర్స్ మాత్రం అస్సలు తగ్గలేదు..ఇకపోతే ఈ అమ్మడు నటించిన ఐదు సినిమాలు బ్యాక్‌ టూ బ్యాక్‌ పరాజయం చెందాయి. అంతకు ముందు లక్కీ హీరోయిన్‌గా, గోల్డెన్‌ లెగ్‌గా పిలుచుకున్న ఇండస్ట్రీ వర్గాలు ఇప్పుడు మరో రకంగా నిందలు వేయడం ప్రారంభించారు. కానీ తాను మాత్రం తన స్టయిల్లో ముందుకు సాగుతుంది.. ప్రస్తుతం పూజాకి రెండు మూడు సినిమాలకు సంబంధించిన కథా చర్చలు జరుగుతున్నాయట. ప్రస్తుతం కొత్తగా ఇంకా మరేదీ కన్ఫమ్‌ కాలేదు. త్వరలోనే కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించిన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.. సోషల్ మీడియాలో పూజాకు ఎలాంటి ఫాలోయింగ్ ఉందో అందరికి తెలుసు..

Show comments