Site icon NTV Telugu

Suriya 44 : సూర్య మూవీలో పూజ హెగ్డే.. అధికారికంగా ప్రకటించిన చిత్ర యూనిట్..

Pooja Hegde

Pooja Hegde

Suriya 44 : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీ గా వున్నారు.ప్రస్తుతం సూర్య నటిస్తున్న లేటెస్ట్ “కంగువ”.కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను స్టూడియో గ్రీన్ అండ్ యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై జ్ఞానవేల్ రాజా , వంశికృష్ణ రెడ్డి మరియు ప్రమోద్ ఉప్పలపాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సూర్య సరసన బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే యానిమల్ మూవీ ఫేమ్ బాబీ డియోల్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నారు.

Read Also :Nikhil Siddarth : ‘స్వయంభూ’ సెట్ లో నిఖిల్ బర్త్ డే సెలెబ్రేషన్స్.. పిక్స్ వైరల్..

ఇదిలా ఉంటే సూర్య నటిస్తున్న మరో మూవీ ” సూర్య 44 “..ఈ సినిమాను కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ జిగర్ తండా డబల్ ఎక్స్ ఫేమ్ కార్తీక్ సుబ్బరాజు తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించనున్నారు.ఈ సినిమాలో పాపులర్ మలయాళ నటుడు జోజు జార్జ్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడు.తాజాగా ఈ సినిమా కు సంబంధించి మేకర్స్ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు.ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.తాజాగా పూజ హెగ్డేకు వెల్కమ్ చెబుతూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసారు.ఈ పోస్టర్ బాగా వైరల్ అవుతుంది.ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ జూన్ నుండి ప్రారంభం కానున్నట్లు సమాచారం.

Exit mobile version