NTV Telugu Site icon

Ponnam Prabhakar: వాహనదారులకు వీడియో సందేశం ద్వారా విజ్ఞప్తి చేసిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

Ponnam

Ponnam

Ponnam Prabhakar: వాహనదారులకు వీడియో సందేశం ద్వారా విజ్ఞప్తి చేసారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. సగటున దేశ వ్యాప్తంగా సంవత్సరానికి లక్షా 60 వేల మంది రోడ్డు ప్రమాదంలో చనిపోతున్నారని.. తెలంగాణలో సగటున రోజుకి 20 మంది రోడ్డు ప్రమాదంలో మరణిస్తున్నారని తెలిపారు. దసరా చెడుపై మంచి విజయం సాధించిన దానికి గుర్తుగా కుటుంబ సభ్యులందరం కలిసి ఈ దసరాకి ఆయుధపూజ చేసే సమయంలో ఒక ప్రతిజ్ఞ చేద్దాం అంటూ తెలిపారు.

Read also: Ratan Tata: ఆర్థిక ప్రగతికి మానవత్వాన్ని అద్దిన అరుదైన పారిశ్రామిక వేత్త రతన్ టాటా: కేసీఆర్

ఇందులో భాగంగా ట్రాఫిక్ రూల్స్ పాటిద్దాం..,హెల్మెట్, సీటు బెల్టు పెట్టుకుందామని., మద్యం తాగి వాహనం నడపరాదు ఇది ప్రమాదానికి సూచిక.. అంటూ తెలిపారు.

Read also: Pilot Heart Attack: విమానం నడుపుతుండగా పైలట్ మృతి.. ఆ తర్వాత?

Show comments