NTV Telugu Site icon

Bonalu 2024: అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ఘటాలు సమర్పించుకున్న మంత్రులు..

Bonalu 2024

Bonalu 2024

గోల్కొండ కనకాల కట్ట మైసమ్మ దేవాలయంలో తెలంగాణ కుమ్మర్ల తొలి బోనాల జాతర జరిగింది. ముఖ్య అతిథిగా మంత్రులు కొండా సురేఖ, హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్,జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయ లక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ఘటాలు సమర్పించుకున్నారు మంత్రులు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఆషాఢ మాస బోనాల దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తొలి కుమ్మర్ల బోనం ఈరోజు కట్ట మైసమ్మ అమ్మవారికి సమర్పిస్తున్నారన్నారు. బోనాల పండుగ హైదరాబాద్ జంట నగరాల సంస్కృతి, సాంప్రదాయాలకు పుట్టినిల్లు అని, గతంలో బోనం మట్టి కుండలోనే తీసేవారన్నారు.

 

ఇప్పుడు కూడా బోనం ప్రకృతి పర్యావరణమే కాకుండా అమ్మవారికి ఇష్టమైన మట్టి కుండలోనే చేయాలన్నారు. అలా సమర్పిస్తే మరింత పుణ్యం ఉంటుంది.. ఇతర పాత్ర లలో చేసిన కంటే మట్టి కుండలో చేస్తే ఆశీర్వచనం ఉంటుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్‌. హైదరాబాద్ బోనాలలో పాల్గొనే అందరూ మట్టి కుండలోనే బోనం వాడాలని హైదరాబాద్ ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నా అన్నారు. దేవాదాయ , పర్యావరణ శాఖ మంత్రి గారు ఈ బోనాలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు జరగాలన్నారు. కుమ్మర్లు గ్రామీణ ప్రాంతాల్లో ఆహార ధాన్యాలు వండుకునే వస్తువుల నుండి అన్ని రకాల వస్తువులు తయారు చేస్తుంటారని, కాలం మారుతోంది మళ్ళీ కుల వృత్తి బతకాలంటే ఆ కుల వృత్తులు తయారు చేసే వస్తువులు అందరూ వాడాలన్నారు. కుల వృత్తి బతకాలంటే అమ్మవారి ఆశీర్వాదం పొందాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్‌.