Ponguleti: పేదోడి ఆత్మగౌరవమే ఇందిరమ్మ టవర్స్ లక్ష్యం

  • రాయదుర్గంలో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్‌‌కు శంకుస్థాపన
  • లబ్ధిదారులకు ఇల్లు కేటాయింపు పత్రాలు పంపిణీ
  • పేదోడి ఆత్మగౌరవమే ఇందిరమ్మ టవర్స్ లక్ష్యమన్న పొంగులేటి
Ponguleti Srinivasa Reddy

Ponguleti Srinivasa Reddy

పేదవాడి ఆత్మగౌరవమే ఇందిరమ్మ టవర్స్ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. రాయదుర్గం మల్కం చెరువు సమీపంలో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్‌ నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం లబ్ధిదారులకు ఇల్లు కేటాయింపు పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పట్టణ పేదల సొంతింటి కలకు తొలి అడుగు ఇందిరమ్మ ఇండ్ల టవర్స్‌కు శంకుస్థాపన అన్నారు.

పైరవీలకు తావులేకుండా పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని చెప్పారు. వచ్చే బోనాల నాటికి ఇక్కడి నుంచే బోనాలు ఎత్తించేలా పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఖరీదైన ప్రాంతాల్లోనే పేదలకు సొంత ఇళ్లు.. ఉచిత రిజిస్ట్రేషన్‌తో హక్కులు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఏ పార్టీ వారు అని చూడకుండా ఇల్లు మంజూరు చేస్తున్నామని.. వచ్చే నెల రోజుల్లో ప్రతి నియోజకవర్గంలో ఇందిరమ్మ టవర్ల నిర్మాణం ప్రారంభిస్తామని తెలిపారు.