NTV Telugu Site icon

Lok sabha election: ముగిసిన తొలి విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే..!

Lele

Lele

దేశ వ్యాప్తంగా తొలి విడత ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం నుంచి ఎండలు దంచికొడుతున్న ఓటర్ల మాత్రం ఓటేసుకుందు క్యూ కట్టారు. పోలింగ్ కేంద్రాలు జనాలతో నిండిపోయాయి. ఆయా రాష్ట్రాల్లో గతం కంటే ఎక్కువగానే పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 3 గంటలకే 50 శాతం పోలింగ్ దాటిందని ఎన్నికల సంఘం ప్రకటించింది. సాయంత్రం 5గంటలకు పోలింగ్ ముగిసింది. మొత్తం ఎంత పోలింగ్ నమోదైంది అనేది మరికొద్ది సేపట్లో ఈసీ అధికారికంగా వెల్లడించనుంది.

ఇది కూడా చదవండి: Jaggareddy: బీజేపీ నేతలు డూప్లికేట్‌ దేశభక్తులు.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

కొన్ని రాష్ట్రాల్లో చెదురుమదురు ఘటనలు మినహా ఓటింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. మొదటి విడతలో 21 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 స్థానాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అత్యధికంగా ఈశాన్య రాష్ట్రం త్రిపురలో భారీగా పోలింగ్‌ నమోదైనట్లు సమాచారం. ఆ తర్వాత మణిపూర్‌, మేఘాలయ, అస్సాంలో ఎక్కువ మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అత్యల్పంగా బిహార్‌లోనే పోలింగ్‌ నమోదైనట్లు తెలుస్తోంది. లోక్‌సభ స్థానాలతో పాటు అరుణాచల్‌ ప్రదేశ్‌, సిక్కింలోని శాసనసభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇక ఆయా రాష్ట్రాల్లో పలువురు ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. వృద్ధులు, కొత్త జంటలు ఓటు వేసి పలువురికి ఆదర్శంగా నిలిచారు.

ఇది కూడా చదవండి: Shahrukh Khan: సల్మాన్ తర్వాత షారుఖ్.. భారీగా భద్రత పెంపు!