NTV Telugu Site icon

Botsa Satyanarayana: విశాఖలో మారుతున్న రాజకీయ సమీకరణాలు.. రంగంలోకి మాజీ మంత్రి

Bostha

Bostha

Botsa Satyanarayana: విశాఖపట్నం నగరంలో రాజకీయ సమీకరణాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ముఖ్యంగా జీవీఎంసీ (GVMC) మేయర్ పీఠం కోసం కూటమి ప్రభుత్వం, వైసీపీ మధ్య ఉత్కంఠత పెరుగుతోంది. టీడీపీ, జనసేన కలిసికట్టుగా మేయర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టి వైసీపీకి అడ్డుకట్ట వేసేందేకు ప్రయత్నిస్తున్నాయి. అయితే, దీనిని తిప్పికొట్టేందుకు వైసీపీ కూడా వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. ఈ క్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు.

Read also: RSS: “దారా షికో”ని కాకుండా “ఔరంగజేబు”ని కొలుస్తున్నారు.. వారు దేశానికి ప్రమాదం..

టీడీపీ, జనసేన మేయర్‌ను పదవి నుంచి తప్పించే ప్రయత్నాలు చేయగా వైసీపీ అధిష్టానం బొత్స సత్యనారాయణను రంగంలోకి దించింది. ఈ నేపథ్యంలో ఆయన వైసీపీ కార్పొరేటర్లతో భేటీ అయ్యారు. టీడీపీ వలసలకు అడ్డుకట్ట వేయడానికి, మేయర్‌పై అవిశ్వాస తీర్మానం నెగ్గకుండా పక్కా వ్యూహాలను రచిస్తున్నారు. ఇటీవల, వైసీపీని వీడిన కార్పొరేటర్లను తిరిగి ఒప్పించేందుకు బొత్స నడుం బిగించారు. మేయర్‌పై అవిశ్వాస పరీక్ష రోజుకు ముందుగా వైసీపీ కార్పొరేటర్లను ప్రత్యేక క్యాంపులకు తరలించే ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. మేయర్‌ సీటును కాపాడేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేయాలని పార్టీ నిర్ణయించుకుంది.

Read also: KTR : కేటీఆర్‌ కరీంనగర్ పర్యటనలో అపశృతి..

ఇదివరకే విశాఖపట్నంలో బలం పెంచుకోవాలని టీడీపీ, జనసేన సమన్వయంగా పనిచేస్తూ వైసీపీ కార్పొరేటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే తాము సరిపడా సంఖ్యలో కార్పొరేటర్ల మద్దతును సంపాదించామని చెబుతున్నారు. దీనిలో భాగంగానే వైసీపీ మేయర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయించారు. ఈ ఉత్కంఠ భరితమైన రాజకీయ పోరులో మేయర్ పదవి ఎవరి చేతికి వెళ్లనుందనేది ఆసక్తికరంగా మారింది. వైసీపీ మేయర్‌ను కాపాడుకుంటుందా? లేక టీడీపీ-జనసేన కూటమి పీఠాన్ని దక్కించుకుంటుందా? అనేది త్వరలోనే తేలనుంది. ప్రస్తుతం రాజకీయ వలసలు, వ్యూహాత్మక సంచలనాలు విశాఖలో హాట్ టాపిక్‌గా మారాయి.