Counselling to RowdySheeters: ఎన్నికల వేళ బెజవాడలో రౌడీ షీటర్లకి పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. కమిషనరేట్ పరిధిలో ఉన్న అన్ని జోన్లలో రౌడీ షీటర్లకి కౌన్సెలింగ్ ఇచ్చారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో పశ్చిమ నియోజకవర్గ పరిధిలో ఉన్న భవానీపురం, ఇబ్రహీంపట్నం, టూ టౌన్ పోలీస్ స్టేషన్లలో రౌడీ షీటర్లకు ఈరోజు కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగిందని డీసీపీ కృష్ణకాంత్ పాటిల్ తెలిపారు.
Read Also: Vizag: విశాఖలో గంజాయి కంటైనర్‌ను వెంటాడి పట్టుకున్న పోలీసులు
ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న 249 మంది రౌడీషీటర్లకు.. సస్పెక్ట్ షీటర్లకు ఈ రోజు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగిందన్నారు. రౌడీ షీటర్లలను, గంజాయి బ్యాచ్‌లను, బ్లేడ్ బ్యాచ్‌లకు కౌన్సిలింగ్ ఇచ్చారని తెలిపారు. ఎన్నికల సమయంలో ఎలాంటి గలాటా చేసినా ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. మీరు సత్ప్రవర్తనతో ఉంటే మీకు మంచి భవిష్యత్తుని మేమే కల్పిస్తామని డీసీపీ చెప్పారు. మీరు మంచి ప్రవర్తనతో ఉంటే మీలో టాలెంట్‌ను గుర్తించి మంచి భవిష్యత్తు మేము చూపిస్తామని చెప్పారు.