Site icon NTV Telugu

BRS Balka Suman: సీఎం రేవంత్ పై కామెంట్స్.. బాల్క సుమన్ కు నోటీసులు

Balka Suman

Balka Suman

BRS Balka Suman: బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మంచిర్యాల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి… ఇందులో భాగంగా ఆదివారం నోటీసులు అందజేశారు. నోటీసులు అందుకున్న సుమన్… వాటిపై సంతకం చేశారు. పోలీసుల నోటీసులపై బాల్క సుమన్ స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై, కాంగ్రెస్ ప్రభుత్వంపై మంచిర్యాల పోలీస్ స్టేషన్ లో అక్రమంగా కేసు నమోదు చేశారని ఆరోపించారు. ఇందులో భాగంగానే మంచిర్యాల ఎస్సై కేసులకు సంబంధించి నోటీసులు ఇచ్చినట్లు వెల్లడించారు. ఉద్యమంలో ఎన్నో కేసులు ఎదుర్కొని పోరాడిన పార్టీ తమదేనన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు ప్రజల పక్షాన పోరాడతానని స్పష్టం చేశారు.

Read also: GPS-Based Toll: ఇక “GPS-ఆధారిత టోల్” వసూలు విధానం.. ఎలా పనిచేస్తుంది..?

అసలు ఏం జరిగింది…

బీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఘాటైన పదజాలంతో దూషిస్తూ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసనలు తెలిపాయి. మంచిర్యాల నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడిన సుమన్… కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు రేవంత్ రెడ్డిపైనా ఘాటుగా మాట్లాడారు. రేవంత్ రెడ్డిని విమర్శించిన కేసీఆర్.. చెప్పు చూపి కొడతారని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పలు స్టేషన్లలో ఫిర్యాదులు కూడా చేశారు. ఇందులో భాగంగా… మంచర్యాల పోలీసులు కేసు నమోదు చేశారు. సుమన్ వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేతలు సమర్థిస్తున్నారు. తమ నేతను అసభ్య పదజాలంతో దూషించిన సీఎం రేవంత్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ముందుగా రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని అంటున్నారు. ప్రతి చర్యకు ఒక చర్య ఉన్నట్లుగా కౌంటర్ ఇచ్చారు.
Dairy Milk Chocolate: చాక్లెట్‌లో బ్రతికున్న పురుగు.. హైదరాబాద్ అమీర్‌పేటలో ఘటన

Exit mobile version