NTV Telugu Site icon

Komuravelli Temple: కొమురవెల్లి ఆలయం వద్ద భక్తులపై లాఠీచార్జ్!

Komuravelli Temple

Komuravelli Temple

Police Lathi Charge on Komuravelli Temple Devotees: మహాశివరాత్రి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలోని శైవక్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. సిద్ధిపేటలోని శైవ క్షేత్రమైన కొమురవెళ్లి మల్లికార్జున స్వామి ఆలయంకు భక్తుల భక్తులు భారీ సంఖ్యలో వచ్చారు. దాంతో శుక్రవారం కొమురవెళ్లి ఆలయ భక్తులతో కిటకిటలాడింది. అయితే పెద్ద పట్నంలోని పసుపు బండారి కోసం ఎగబడిన భక్తులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు.

Also Read: Summer Temperatures: దంచికొడుతున్న ఎండలు.. మార్చిలోనే రికార్డులు బ్రేక్‌!

శుక్రవారం అర్థరాత్రి ఆలయ తోటబావి వద్ద పంచవర్ణాలతో 42 వరుసలతో ఆలయ ఒగ్గు పూజరులచే పెద్ద పట్నం వేశారు. పెద్దపట్నం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. సుమారు 300 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పెద్ద పట్నం పూర్తవగానే పసుపు బండారి కోసం భక్తులు ఎగబడ్డారు. పట్నం చుట్టూ ఏర్పాటు చేసిన భారీ కంచెలపై ఎక్కి పట్నంపైకి దూకి పసుపు బండారి తీసుకునేందుకు భక్తుల ప్రయత్నం చేశారు. భక్తులను పోలీసులు అడ్డుకున్నా.. అదుపు చేయలేకపోయారు. దాంతో భక్తుల్ని నిలువరించేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు.

Show comments