NTV Telugu Site icon

Masthan Sai : మస్తాన్ సాయి కేసులో వేగం పెంచిన పోలీసులు

Masthan Sai

Masthan Sai

గుంటూరు మస్తాన్ సాయి కేసులో వేగం పెంచారు పోలీసులు. ఓ వివాహానికి వచ్చిన తనపై మస్తాన్ సాయి అత్యాచారం చేశాడని పోలీసులకు కొన్నేళ్ల క్రితమే ఫిర్యాదు చేసింది రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య. 2023 మార్చ్ 30 పట్టాభీపురం పోలీస్ స్టేషన్లో మస్తాన్ సాయి పై కేసు నమోదు కూడా అయింది. అయితే ఆ తర్వాత పలు కారణాలతో, నగరంపాలెంకు కేసును బదిలీ చేశారు ఉన్నతాధికారులు. ఈ కేసులో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ రిపోర్ట్ పెండింగ్ ఉందని పోలీసులు అంటున్నారు. అయితే ఇప్పుడు మస్తాన్ సాయి పై నమోదవుతున్న కేసుల తీవ్రత దృష్ట్యా, వీలైనంత త్వరగా ల్యాబ్ రిపోర్ట్ తెప్పించి, చాట్ షీట్ ఫైల్ చేస్తామని పోలీసులు చెబుతున్నారు.

Allu Aravind: చరణ్ నా కొడుకు లాంటోడు.. ఇక్కడితో ఆపేయండి!

ఇప్పటికే ప్రాథమిక చార్జ్ షీట్ కూడా నగరపాలెం పోలీసులు దాఖలు చేసినట్టు తెలుస్తోంది. అయితే నిజానికి తాజాగా ఈ కేసులో మరో ఆడియో వెలుగులోకి వచ్చింది. ఏపీలోని గుంటూరులో మస్తాన్ సాయి పై లావణ్య పెట్టిన కేసులో పోలీసులతో బేరసారాలు ఆడినట్టు వెలుగులోకి వచ్చింది. ఛార్జ్ షీట్ వేసే సమయంలో తమకు అనుకూలంగా రాస్తే డబ్బులు పోలీసులు ఇద్దామని మస్తాన్ సాయి, తండ్రి ప్రలోభాలకు గురి చేస్తున్నట్టుగా ఉన్న ఆడియో ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఇక అలా పోలీసులకు డబ్బు ఎర వేసి ఛార్జ్ షీట్ తమకు అనుకూలంగా మస్తాన్ సాయి మార్చుకున్నట్టు తాజాగా ఆడియోతో బట్టబయలు అయ్యింది.