Site icon NTV Telugu

AP Crime: వైసీపీ నేత దారుణ హత్య.. ఏడుగురిని అరెస్ట్‌ చేసిన పోలీసులు

Crime

Crime

AP Crime: అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలో గతవారం జరిగిన వైసీపీ నేత శేషాద్రి హత్య కేసులో ఏడుగురు నిందితులను అరెస్ట్‌ చేశారు పోలీసులు.. ఇరు వర్గాల ఆధిపత్య పోరే ఈ హత్యకు కారణంగా చెబుతున్నారు పోలీసులు.. నిందితుల్లో బహుజన సేన ప్రజా సంఘంలో పనిచేసిన కొండుపల్లె ఆనంద్, మణికంఠ, బండి మహేష్, రాజశేఖర్, చరణ్ కుమార్, చంద్రశేఖర్ రెడ్డి, నజీర్ ఖాన్‌ ఉండగా.. వీరిని అరెస్ట్‌ చేసిన రిమాండ్ కు తరలించారు పోలీసులు.. హత్యకు ఉపయోగించిన ఇనోవా కారు, ఆటో, ద్విచక్ర వాహనంతో పాటు మరణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

Read Also: Sriranga Neethulu : ఓటీటీ లో అదరగొడుతున్న సుహాస్ శ్రీరంగ నీతులు..

కాగా, అన్నమయ్య జిల్లా మదనపల్లెలో గతవారం దారుణం చోటుచేసుకుంది. మదనపల్లె పట్టణం శ్రీవారినగర్‌లో వైసీపీ నాయకుడు పుంగనూరు శేషాద్రి దారుణ హత్యకు గురయ్యారు. శేషాద్రి ఇంట్లోకి దూరిన దుండగులు కత్తులతో విచక్షణ రహితంగా దాడి చేశారు. దాంతో ఆయన రక్తపుమడుగులో కుప్పకూలారు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని విచారణ చేపట్టారు. దుండగులు పరారీ కాగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఈ కేసులో ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. కాగా, ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న విషయం విదితమే.. అయితే, శాంతిభద్రతలను కాపాడడంలో విఫలమైన సంబంధిత అధికారులపై ఎన్నికల కమిషన్ చర్యలు కూడా తీసుకుంది.

Exit mobile version