Site icon NTV Telugu

Police Harassment: రక్షక భటుడే రాక్షసుడైతే! యువతిపై అసభ్యకరంగా ప్రవర్తించిన కానిస్టేబుల్.. వీడియో వైరల్

Police

Police

Police Harassment: రోజురోజుకి ప్రపంచంలో మహిళలపై దాడులు పెరుగుతున్నాయి తప్పించి తగ్గడం లేదనిపిస్తోంది. ఈ బాధలు తట్టుకోలేక చాలామంది మహిళలు ప్రాణాలు కోల్పోతుండగా.. మరికొందరు మాత్రం తమని రక్షించాలని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేస్తున్నారు. అయితే కొన్నిసార్లు మహిళలను కాపాడాల్సిన పోలీసులే వక్రదారులు పడుతున్నారు. తాజాగా ఇలాంటి సంఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే ఇలా ఉన్నాయి.

కేవలం రూ.5,999లకే ఇన్ని ఫీచర్స్ ఏంటయ్యా..? కొత్త Itel Zeno 20 లాంచ్!

ఢిల్లీ నుండి ప్రయాగ్‌రాజ్ వెళ్తున్న ట్రెయిన్‌లో మహిళల భద్రతను కాపాడాల్సిన జీఆర్‌పీ కానిస్టేబుల్ ఆశిష్ గుప్తా దారుణంగా ప్రవర్తించాడు. రాత్రివేళలో లైట్లు ఆఫ్ చేసి ఉండటాన్ని అవకాశంగా తీసుకున్న అతను, నిద్రలో ఉన్న ఓ యువతిని అసభ్యకరంగా తాకేందుకు ప్రయత్నించాడు. ఎవరూ గుర్తించరన్న ఉద్దేశంతో ఈ నీచపు పనికి పాల్పడ్డాడు. అయితే యువతి నిద్రలేచి అతడిని పట్టుకోవడంతో ఆశిష్ గుప్తా బిత్తరపోయి క్షమించమని వేడుకున్నాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ యువతి “మహిళలను రక్షించాల్సిన నువ్వే ఇలాంటి నీచపు పనులు చేస్తే ఎలా?” అంటూ మండిపడింది.

CPL 2025: 46 ఏళ్ల వయసులో కూడా తగ్గేదేలే.. టీ20ల్లో 5/21 గణాంకాలు!

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు వెంటనే స్పందించి.. కానిస్టేబుల్ ఆశిష్ గుప్తాను సస్పెండ్ చేశారు. మహిళల భద్రతను కాపాడాల్సిన పోలీసు సిబ్బంది ఇలాంటి చర్యలకు పాల్పడటం ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి గురైంది. మహిళల భద్రతపై మరింత కఠిన చర్యలు అవసరమని సోషల్ మీడియాలో అనేక మంది నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు.

Exit mobile version