NTV Telugu Site icon

Scam Alert: రూ. 2,200 కోట్ల షేర్ మార్కెట్ భారీ కుంభకోణం..

Cyber

Cyber

Scam Alert: దేశంలో సైబర్ క్రైమ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా రూ. 2,200 కోట్ల భారీ కుంభకోణాన్ని అస్సాం పోలీసులు బట్టబయలు చేశారు. నివేదిక ప్రకారం, ఈ పెద్ద స్కామ్ చేయడానికి సైబర్ మోసగాళ్ళు ఆన్‌లైన్‌లో షేర్లలో పెట్టుబడి పెట్టడం ద్వారా డబ్బు సంపాదించవచ్చని ప్రజలను మోసగించారు. ఈ కేసును విచారిస్తున్న అస్సాం పోలీసులు ఇప్పటివరకు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. అరెస్టయిన నిందితులను దిబ్రూఘర్‌కు చెందిన ఆన్‌లైన్ వ్యాపారవేత్త విశాల్ ఫుకాన్, గౌహతికి చెందిన స్వప్నిల్ దాస్‌ లుగా గుర్తించారు. వారి ఆకర్షణీయమైన జీవనశైలి ద్వారా, ఆన్‌లైన్ స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా 60 రోజుల్లో 30 శాతం లాభం పొందుతారనే మాయమాటలతో ఫుకాన్ ప్రజలను ట్రాప్ చేసేవాడు. ఈ మోసం చేయడానికి, అతను తన సొంతంగా అనేక నకిలీ కంపెనీలను సృష్టించాడు. అలాగే అస్సాంలోని చిత్ర పరిశ్రమలో డబ్బును పెట్టుబడి పెట్టాడు .

Rain Alert: ఏపీకి మరోసారి భారీ వర్ష సూచన.. పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలెర్ట్..!

ఈ స్కామ్ రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి ఉందని, భవిష్యత్తులో మరికొంత మంది నిందితులను అరెస్టు చేసే అవకాశం ఉందన్నారు పోలీసులు. ఫుకాన్ నెట్‌వర్క్‌తో కనెక్ట్ అయిన అస్సాం చిత్ర పరిశ్రమ కొరియోగ్రాఫర్ సమీ బోర్ కోసం వెతుకుతున్నారు పోలీసులు. దిబ్రూఘర్‌లో, పోలీసులు ఫుకాన్ ఇంటిపై దాడి చేసి ఈ కుంభకోణానికి సంబంధించిన అనేక ముఖ్యమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ స్కామ్ బహిర్గతం అయిన తర్వాత, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడం, మరేదైనా స్కీమ్‌ల గురించి జాగ్రత్తగా ఉండాలని ప్రజలను కోరారు. మోసగాళ్ళు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు, మోసగాళ్లకు దూరంగా ఉండాలని ప్రజలను ఆయన కోరారు.