అల్లర్లు జరుగుతాయన్న ప్రచార నేపద్యంలో., పల్నాడు జిల్లా మాచర్లకు వచ్చే అన్ని వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించి మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు పోలీసులు. అనుమానస్పదంగా ఉంటే వారిని అదుపులోకి పోలీసులు తీసుకుంటున్నారు. అల్లర్లు, హింసాత్మక ఘటనలకు పాల్పడితే.. ఎవరైనాసరే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు.
Also read: Sandeshkhali : సందేశ్‌ఖలీ కేసులో అప్‌డేట్.. పియాలి దాస్‌కు 8రోజుల జ్యుడిషియల్ కస్టడీ
నిన్న రాత్రి నుండి పల్నాడు జిల్లా మాచర్లలోనే ఐజి సర్వ శ్రేష్ట త్రిపాఠి మకాం వేసి ఉన్నారు. పల్నాడు ఎస్పితో పాటు ఇతర సీనియర్ పోలీసు అధికారుల నేతృత్వంలో, ఏకంగా 2300 మంది సిబ్బందితో భద్రత ఏర్పాట్లు నివహిస్తున్నారు పోలీసులు. మరోవైపు పలనాడులో అనేక ప్రాంతాల్లో అప్రకటిత కర్ఫ్యూ కనపడుతోంది.
Also read: Tata Play-Amazon Prime: ఇకపై డీటీహెచ్‌లోనూ ప్రైమ్ వీడియో!
షాపులు తీసేందుకు వ్యాపార వర్గాలు విముఖత చూపిస్తున్నారు. నిన్న రాత్రి నుండి దుకాణాలు పలు వ్యాపార వర్గాలు మూసేసాయి. ప్రస్తుతం మాచర్ల కు భారీగా పోలీసు బలగాలు చేరుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేస్తున్నారు పోలీసులు.