ప్రకాశం జిల్లా తర్లుబాడు మండలంలోని తాడివారిపల్లి అటవీ ప్రాంతంలో బత్తుల దేవధరణి (22) అనే యువకుడిని కత్తితో పొడిచి హత్య చేసిన అనంతరం పెట్రోల్ పోసి మృతదేహాన్ని తగలబెట్టిన దుండగులు ఈనెల 2వ తేదీ తెల్లవారు జామున ఘటన జరిగినట్లు నిర్ధారించిన పోలీసులు. కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ మండలం పెద్ద ఎమ్మిగనూరు గ్రామానికి చెందిన యువకుడుగా గుర్తించారు పోలీసులు. విశాఖపట్నం లోని లాడ్జ్ అండ్ రెస్టారెంట్ లో మేనేజర్ గా పని చేస్తున్న బత్తుల దేవ ధరణి (22)ను ఈ నెల 1 వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో కర్నూలు జిల్లా నుండి తనను కలవడానికి ఎవరో వస్తున్నారని చెప్పి బయటికి వెళ్ళిన కొంత సేపటికి ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉండగా తన తమ్ముడిని వెతకగా ఎక్కడ అతని ఆచూకీ దొరకలేదు.
Read Also: Virat Kohli :’చాలా రోజుల తర్వాత’.. కోహ్లీ ఎమోషనల్ పోస్ట్
ఈ విషయమై విశాఖపట్నం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. స్వప్న అనే ఒక అమ్మాయి కాల్ చేసి ఆర్కే బీచ్ కు రమ్మనట్టు, ఆర్కే బీచ్ లో ఎవర్నో కలవడానికి కలుసుకోవడానికి వెళ్ళగా ఒక కారులో అతనిని తీసుకు పోయినట్టు తెలిసింది. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం రాగిరి ప్రవీణ్ కు గంగ అనే అమ్మాయి ప్రియురాలు ఉంది, ప్రస్తుతం ఆ గంగ అనే అమ్మాయి బత్తుల దేవ ధరణితో చనువుగా ఉండటంతో ప్రవీణ్ అతని కొంతమంది స్నేహితులతో కలిసి రాగిరి ప్రవీణ్ కుమార్,మనోజ్,సురేష్, పగిడి శివ కిరణ్,రాగిరీ చాణక్య సాయముతో హత్య చేసినట్టు దర్యాప్తు చేస్తున్నారు.
నిందితులు ఎవరంటే?
తర్లుబాడు మండలం తాడివారిపల్లె ఘాట్ రోడ్డులో కత్తితో పొడిచి చంపి పెట్రోల్ తో కాల్చిన దేవ ధరణి అనే యువకుడి కేసును ఛేదించిన పొలీసులు. ఆరుగురు ముద్దాయిలలో ఓ కారు డ్రైవర్ అరెస్టు..అక్రమ సంబంధం నేపథ్యంలోనే హత్యకు పాల్పడ్డ నిందితులు..మిగతా ఐదుగురి కోసం కొనసాగుతున్న పోలీసుల గాలింపు..హతుడికి క్లొరోఫాం ఇచ్చి హత్యకు పాల్పడ్డ నిందితులు..మృతదేహం గుర్తు పట్టకుండా ఉండటం కొసం పెట్రోల్ పొసి దహనం..వైజాగ్ పొలీసుల సమాచారంతో కేసును ఛేదించి వివరాలు వెల్లడించారు దర్శి డీఎస్పీ నారాయణస్వామి రెడ్డి..
Read Also: YashaSri: విమెన్స్ ఐపీఎల్‌లో ఆడుతుండటం సంతోషంగా ఉంది: యశ శ్రీ